Acharya: ఫోకస్ నెక్స్ట్.. ముగ్గురికి రూట్ క్లియర్ చేసిన ఆచార్య!

ఒక్క సినిమా రిలీజ్ అయ్యి ముగ్గురు హీరోల సినిమాలకు రూట్ క్లియర్ చేసింది. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో నటించిన ఆచార్య రిలీజ్ కోసం వెయిట్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నుంచి 5 సినిమాల్ని లైన్లో పెట్టిన చిరంజీవి వరకూ.. అందర్నీ రిలీవ్ చేసింది ఆచార్య.

Acharya: ఫోకస్ నెక్స్ట్.. ముగ్గురికి రూట్ క్లియర్ చేసిన ఆచార్య!

Acharya

Acharya: ఒక్క సినిమా రిలీజ్ అయ్యి ముగ్గురు హీరోల సినిమాలకు రూట్ క్లియర్ చేసింది. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో నటించిన ఆచార్య రిలీజ్ కోసం వెయిట్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నుంచి 5 సినిమాల్ని లైన్లో పెట్టిన చిరంజీవి వరకూ.. అందర్నీ రిలీవ్ చేసింది ఆచార్య. దాంతో నెక్ట్స్ సినిమాల మీద సీరియస్ గా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు ఈ ముగ్గురు. మరి ఈ ముగ్గురు హీరోల నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

Akhanda-Acharya : అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..

హమ్మయ్య.. ఆఛార్య సినిమా రిలీజ్ అయిపోయింది. రెండు, మూడేళ్ల నుంచి టెన్షన్ పడిన హీరోలు ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యారు. నెక్ట్స్ సినిమా మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఒక్క సినిమా రిలీజ్ తో 3 సినిమాలు స్పీడప్ అవ్వబోతున్నాయి. ఆచార్య రిలీజ్ తో రిలీవ్ అయిన హీరోలు, డైరెక్టర్.. నెక్ట్స్ సినిమాలో బిజీ అవుతున్నారు. ఆచార్యతో మూడేళ్లుగా బిజీ అయిన చిరంజీవి ఆల్రెడీ గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు ప్యార్లల్ గా చేస్తున్నా.. ఎక్కువ ఆచార్య మీదే కాన్సన్ ట్రేట్ చేశారు నిన్నటి వరకూ. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్అయ్యింది కాబట్టి తన వెరీ నెక్ట్స్ మూవీ గాడ్ ఫాదర్ పనిని స్పీడప్ చెయ్యబోతున్నారు మెగాస్టార్.

Acharya: ఆచార్య ఆగయా.. ఓన్లీ తెలుగులోనే వర్కౌట్ అవుతుందా?

ఆచార్య రిలీజ్ తో రిలీవ్ అయిపోయిన మరో హీరో చరణ్. 4 ఏళ్లు ప్రాసెస్ లో ఉన్న ట్రిపుల్ ఆర్ లో చరణ్ కూడా చేసినా.. చిరంజీవి ఇంటర్ ఫియరెన్స్ తో ఆచార్య సినిమా కూడా కంప్లీట్ చేసేశాడు. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య.. రిలీజ్ అయ్యి మెగా ఫాన్స్ ని ఆకట్టుకుంటోంది. అటు ట్రిపుల్ ఆర్, ఇటు ఆచార్య రెండు సినిమాలు రిలీజ్ అయిపోయాయి. సో చరణ్ ఫోకస్ అంతా శంకర్ సినిమా మీదే. ఇప్పటికే యాక్షన్ సీన్స్ తో పాటు పాటల్ని కూడా తెరకెక్కిస్తూ.. ఫుల్ స్పీడ్ మీదున్నారు చరణ్.

Acharya: హీరోయిన్ లేని మెగాస్టార్ సినిమా.. కెరీర్‌లోనే ఇదే ఫస్ట్ టైమ్!

4 ఏళ్లుగా ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మరో సినిమా వైపు చూడని ఎన్టీఆర్ కూడా కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో రెండో సారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. నిన్నటి వరకూ ఆచార్య రిలీజ్ లో బిజీగా ఉన్న కొరటాల.. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వడంతో ఫ్రీ అయిపోయారు. సో.. ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన ఎన్టీఆర్ సినిమాకు కూడా లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పటికే ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని హైప్స్ పెంచేసిన కొరటాల ఈ సినిమాకు సంబంధించి పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ ని ప్రజెంట్ చెయ్యబోతున్నారు.