Manchu Vishnu: రాజీనామా చెయ్యొద్దు.. ఐ లవ్ యూ అంకుల్.. ప్రకాష్ రాజ్‌కు మంచు విష్ణు రిక్వెస్ట్!

'మా' అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్.

Manchu Vishnu: రాజీనామా చెయ్యొద్దు.. ఐ లవ్ యూ అంకుల్.. ప్రకాష్ రాజ్‌కు మంచు విష్ణు రిక్వెస్ట్!

Manchu

Prakash Raj: ‘మా’ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్.. తన రాజీనామాను ఆమోదించాలంటూ మంచు విష్ణుకి మెసేజ్ చేశారు. ప్రకాష్ రాజ్ నిర్ణయం నాకు ఏమాత్రం సంతోషకరమైంది కాదని విష్ణు అభిప్రాయపడ్డారు.

తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ విష్ణుకు మెసేజ్ చేశారు. “డియర్ విష్ణు.. కంగ్రాచ్యులేషన్స్.. మా సభ్యుల ఆశీర్వాదంతో గొప్ప విజయం అందుకున్నావ్.. ఆల్ ది బెస్ట్. అయితే, నేను మాత్రం మా సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని ఆమోదించాలని కోరుకున్నాను. ”మా”లో సభ్యుడిగా కాకపోయినా నటుడిగా మీకు అవసరమైన సమయంలో కచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను” అంటూ వాట్సప్‌లో విష్ణుకి మెసేజ్ చేశారు.

ప్రకాష్ రాజ్ మెసేజ్‌కు సమాధానంగా.. “మీ నిర్ణయం కచ్చితంగా సంతోషించదగినది కాదు. నాకంటే మీరు చాలా పెద్దవారు. మీకు తెలుసు సక్సెస్, ఫెయిల్యూర్స్ సహజమని, సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ఒక కాయిన్‌కి రెండు వైపుల ఉండే సైడ్స్. మనం రెండు వైపుల ఏ నిర్ణయాన్ని అయినా ఒకేలా తీసుకోవాలి. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. మీరు ”మా” కుటుంబంలో ఒకరు.

మీ సలహాలు సూచనలు ”మా”కు అవసరం. మనం కలిసి చర్చించుకుందాం అంటూ ప్రకాష్ రాజ్‌కు మెసేజ్ పెట్టారు. ప్లీజ్ నాకు మీరు రిప్లై ఇవ్వొద్దు.. నేను మిమ్మల్ని కలిసి మాట్లాడుతాను. ఐ లవ్ యూ అంకుల్.” అంటూ మంచు విష్ణు సమాధానం ఇచ్చారు.

ఈ కన్వర్జేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను మంచు విష్ణు ట్విట్టర్‌‍లో షేర్ చేశారు.