Khiladi Trailer: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్!

మాస్ మాహారాజా రవితేజ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నాడు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఖిలాడి త్వరలోనే విడుదల కానుంది.

Khiladi Trailer: పేకాటలో నలుగురు కింగ్స్.. ఈ ఆటలో ఒక్కడే కింగ్!

Khiladi Trailer

Khiladi Trailer: మాస్ మాహారాజా రవితేజ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నాడు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఖిలాడి త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న టీం ఒక్కో సింగిల్ వదులుతూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా విడుదల చేశారు మేకర్స్.

Radhe Shyam: వాలెంటైన్స్ నైట్ థీమ్ పార్టీ.. సౌత్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్!

రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉండగా ట్రైలర్ అదే కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ఈ ట్రైలర్ పూర్తిగా మాస్ యాంగిల్ లో ఉంది. రవితేజ నుండి ఫ్యాన్స్ కోరుకొనే అన్ని అంశాలు ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఇందులో మాస్ మహారాజ్ రవితేజ ఫర్ఫార్మెన్స్ హైలెట్ గా కాగా.. హీరోయిన్లు కూడా చాలా అద్భుతంగా నటించారు. మొత్తానికి ఈ సినిమాపై ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసింది. కాగా, ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది.

DJ Tillu: నీ కనులను చూశానే.. సిద్దు పాడిన పాట రిలీజ్!

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయతీ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండడం విశేషం.