Anchor Suma : యాంకర్ సుమ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

తాజాగా ఇవాళ ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన 250 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించారు సుమ. ఈ క్యాన్సర్.....

Anchor Suma : యాంకర్ సుమ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

Suma

 

Anchor Suma :  తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరియాన్ వ్యక్తి యాంకర్ సుమ. యాంకర్ గా గత 20 ఏళ్లుగా మన ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన సుమ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ప్రజలకు, ఇండస్ట్రీ లో ఉన్న పేద కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు సుమ. ఇటీవల దసరా సందర్భంగా సుమ ఈ సంస్థను ప్రారంభించింది.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్‌కి సినిమా క్యారెక్టర్స్ డెడికేట్.. అర్జున్‌రెడ్డి, అపరిచితుడు??

ఈ సంస్థ తరపున ప్రజ్వల అనే మరో సేవా సంస్థ అధినేత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేసారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమకు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులను, వారికి అవసరమైన మెడిసిన్ కూడా అందించారు.

Aghoraa : ఇప్పటివరకు అఘోరా పాత్రలో కనిపించిన హీరోలు వీళ్ళే

తాజాగా ఇవాళ ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన 250 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించారు సుమ. ఈ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ లో 10 మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించాయని గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు తెలిపారు. ఈ 10 మందికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమ కనకాల, డాక్టర్ చినబాబు, డాక్టర్ ప్రమీల, తానా తరపున తానా ట్రస్టీ విద్య గారపాటి పాల్గొన్నారు.