RRR: రాజమౌళి సినిమాకు.. హుజూరాబాద్ ఎన్నికలతో ఫ్రీ పబ్లిసిటీ

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు.. అనుకోని రీతిలో ఓ పబ్లిసిటీ జరుగుతోంది. అది కూడా.. తెలంగాణ రాజకీయాలతో ముడి పడి ఉండడం.. ఇంట్రెస్టింగ్ గా మారింది.

RRR: రాజమౌళి సినిమాకు.. హుజూరాబాద్ ఎన్నికలతో ఫ్రీ పబ్లిసిటీ

Rrr

RRR: జక్కన్నగా పేరున్న రాజమౌళి ఏ సినిమా తీసినా.. ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఆయన ప్రచారం చేసినా.. చేయకపోయినా.. ఏదో ఒక రకంగా పబ్లిసిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు.. అనుకోని రీతిలో ఓ పబ్లిసిటీ జరుగుతోంది. అది కూడా.. తెలంగాణ రాజకీయాలతో ముడి పడి ఉండడం.. ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు ఆర్ఆర్ఆర్ సినిమాకు.. తెలంగాణ పాలిటిక్స్ కు రిలేషన్ ఎలా ఏర్పడిందంటే..

తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలో.. బీజేపీ విజయం సాధించింది. అక్కడ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఈటల రాజేందర్.. త్వరలో మళ్లీ శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. బీజేపీ తరఫున ఆయన శాసనసభలో మూడో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించనున్నారు. అంతకుముందు.. 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్.. తర్వాత 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్.. సభలో ఉన్నారు. వారికి తాజాగా ఈటల రాజేందర్ తోడయ్యారు.

ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. రాజాసింగ్.. రఘునందన్.. రాజేందర్. ముగ్గురి పేర్లూ ఇంగ్లిష్ లో రాస్తే ఆర్ అక్షరంతోనే మొదలవుతాయి. ఈ పాయింట్ పట్టుకున్న బీజేపీ తెలంగాణ కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు.. RRR సినిమా పోస్టర్ లో రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. రాజాసింగ్ బైక్ నడుపుతుంటే.. వెనక రఘునందన్, రాజేందర్ కూర్చున్నట్టుగా డిజైన్ చేసి షేర్ చేసేస్తున్నారు.

తాజాగా హుజూరాబాద్ ఫలితాల్లో ఈటల రాజేందర్ విజయం తర్వాత.. ఈ వేవ్ మరింత పెరిగింది. తెలంగాణ బీజేపీలో త్రిబుల్ ఆర్ అంటూ.. హంగామా మరింతగా కంటిన్యూ అవుతోంది. ఇలా.. రాజమౌళి సినిమాకు హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో అనుకోకుండా మరో రకంగా పబ్లిసిటీ కలిసి వచ్చింది. ఈ విషయంలో.. ఇప్పటివరకూ సినిమా యూనిట్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కానీ.. పబ్లిసిటీ జరుగుతున్న తీరు చూసి వారు కూడా హ్యాపీగానే ఉండే అవకాశం ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. వారి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పిటికే ఈ సినిమాకు సంబంధించి.. ఓ పాట రిలీజైంది. దోస్తీ.. అంటూ సాగే ఆ సాంగ్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్.. గూస్ బంప్స్ కలిగించింది. రాజమౌళి టేకింగ్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించింది.

మరోవైపు.. గ్లింప్స్ చిన్న శాంపిల్ మాత్రమే అని.. సినిమా రిలీజ్ లోపు ఇలాంటి సర్ ప్రైజ్ లు చాలానే ఉంటాయని చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య చెప్పడం.. మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇలా.. సినిమా యూనిట్ చేస్తున్న ప్రయత్నాలతో ఆకాశమే హద్దుగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పబ్లిసిటీ వస్తుండగా.. హుజూరాబాద్ బై పోల్ రూపంలో మరింత ప్రచారం తోడవుతోంది.

Read more:

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..