Full Kick Song: మాస్ మహారాజా మాస్ సాంగ్.. ఊపు ఊపుతుందిగా..

రవితేజ వాయిస్‌తో స్టార్ట్ అయిన ‘ఫుల్ కిక్కు’ సాంగ్.. మాస్ ఆడియన్స్‌కి ఫుల్ జోష్ ఇచ్చేలా ఉంది..

Full Kick Song: మాస్ మహారాజా మాస్ సాంగ్.. ఊపు ఊపుతుందిగా..

Full Kick

Full Kick Song: గతేడాది సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌‌బాస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ వరసు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘రాక్షసుడు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మతో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు.. ‘వీర’ తర్వాత వీరి కలయికలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై జయంతి లాల్ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

Raviteja : ‘మాస్ మహారాజా’ రవితేజ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్..

రవితేజ పుట్టినరోజు (జనవరి 26) సందర్భంగా ‘ఖిలాఢి’ నుండి మాంచి మాస్ మసాలా సాంగ్ వదిలారు. రాక్ స్టార్ డిఎస్పీ తన మార్క్ మాస్ సాంగ్ ఇచ్చారు. శ్రీమణి మాస్ ఆడియన్స్‌కి ఊపు తెచ్చేలా లిరిక్స్ రాయగా.. సాగర్, మమతా శర్మ ఎనర్జిటిక్‌గా పాడారు. శేఖర్ మాస్టర్ మాస్ మహారాజా, డింపుల్ హయతిలతో ఫ్లోర్ షేక్ అయ్యే మూమెంట్స్ వేయించారు.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!

రవితేజ వాయిస్‌తో స్టార్ట్ అయిన సాంగ్, ఫుల్ జోష్ ఇచ్చేలా.. ‘నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు.. ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్స్.. అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు.. ఫుల్ కిక్కు.. ఫుల్ కిక్కు’ అంటూ సాగే సాంగ్ నిజంగానే ఫుల్ కిక్కిచ్చేలా ఉంది. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్, 145 K లైక్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 11న రవితేజ ‘ఖిలాడి’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.