Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్

టాలీవుడ్‌లో వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ తనకంటూ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నిర్మాత బన్నీ వాస్, తాజాగా ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో....

Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
ad

Bunny Vas: టాలీవుడ్‌లో వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ తనకంటూ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నిర్మాత బన్నీ వాస్, తాజాగా ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నాలు హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో, బన్నీ వాస్ అప్పుడే తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా లాంఛ్ చేశారు.

ఆయన మరోసారి కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టును ఎంచుకోవడం విశేషం. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బ‌న్నీ వాస్, విద్య మాధురి నిర్మాత‌లుగా తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వంలో GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 కొత్త సినిమాను ప్రారంభించింది. విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్‌గా సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న GA2 పిక్చర్స్ ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాతో రాబోతుంది. జోహార్, అర్జున ఫాల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ మార్ని దర్శకత్వంలో పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బ‌న్నివాస్‌తో పాటు విద్య మాధురి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా‌, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.