Mahesh Babu : మహేష్ మేనల్లుడు ‘హీరో’ మహేష్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా

కొరటాల శివ గల్లా అశోక్ గురించి మాట్లాడుతూ.... ''అశోక్ నా దగ్గర మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. చెప్పిన ప్రతి విషయాన్ని.................

Mahesh Babu  :  మహేష్ మేనల్లుడు ‘హీరో’ మహేష్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా

Mahesh

Mahesh Babu :  సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా జనవరి 15 సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది వచ్చారు.

Shannu Deepu : బ్రేకప్ చెప్పింది దీప్తి.. మా అబ్బాయి కాదు.. వాళ్ళు కలుస్తారు : షణ్ముఖ్ తండ్రి

ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ హీరో గల్లా అశోక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొరటాల శివ గల్లా అశోక్ గురించి మాట్లాడుతూ…. ”అశోక్ నా దగ్గర మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకొనే వాడు. ఎంతో ఫ్యాషనేట్ గా పని చేశాడు. అతను చేసే హార్డ్ వర్క్, అతనికి ఉన్న డెడికేషన్ కి అశోక్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడు.” అని తెలిపారు. దీంతో మహేష్ మేనల్లుడు అశోక్ మహేష్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన విషయం వైరల్ అవుతుంది.