పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా “గమనం” ట్రైలర్

10TV Telugu News

శ్రియ శరన్.. నిత్యామీనన్.. ప్రియాంక జవాల్కర్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజనారావు తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా సినిమా ‘గమనం’. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా విడుదల చేశారు.


మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తుండగా.. విలక్షణమైన సినిమాగా సుజనా రావు దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాకు సంబంధించిన అంచనాలు పెంచగా.. మొత్తం అయిదుభాషల్లో ఈ సినిమా రూపొందుతుండటంతో ట్రైలర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో భాగంగా తెలుగు ట్రైలర్‌ను పవన్‌ విడుదల చేశారు. హిందీలో సోనూసూద్‌, తమిళ్‌లో జయం రవి, కన్నడలో శివరాజ్‌ కుమార్‌, మలయాళ వర్షన్ ఫహద్‌ ఫసిల్‌ విడుదల చేశారు.https://10tv.in/pawan-kalyan-jet-speed-in-films/
చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నిత్యామీనన్‌ కర్ణాటక గాయకురాలు శైలపుత్రీ దేవి పాత్రలో కనిపిస్తున్నారు ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందంచగా.. జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ సినిమాటోగ్రాఫీ ఇస్తున్నారు. రమేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పుల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

10TV Telugu News