Gangula Kamalakar : తెలంగాణ వచ్చింది కాబట్టే ఇలాంటి మాణిక్యాలు బయటకి వస్తున్నాయి.. నాని ఎక్కడ పుట్టినా తెలంగాణ బిడ్డే..

దసరా సినిమా భారీ విజయం సాధించడంతో దసరా ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ ఎన్ని సక్సెస్ ఈవెంట్ ని కరీంనగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ప్రముఖులు వచ్చారు.

Gangula Kamalakar : తెలంగాణ వచ్చింది కాబట్టే ఇలాంటి మాణిక్యాలు బయటకి వస్తున్నాయి.. నాని ఎక్కడ పుట్టినా తెలంగాణ బిడ్డే..

Gangula Kamalakar comments on Nani and Dasara movie success

Gangula Kamalakar :  నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో వచ్చిన దసరా(Dasara) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్(Block Buster) గా నిలిపాయి. దసరా సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

దసరా సినిమా భారీ విజయం సాధించడంతో దసరా ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ ఎన్ని సక్సెస్ ఈవెంట్ ని కరీంనగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ప్రముఖులు వచ్చారు. దసరా సక్సెస్ ఈవెంట్ లో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నాని, చిత్రయూనిట్ ని అభినందించారు.

Dasara Blockbuster Daawath : దసరా ధూమ్ ధామ్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ గ్యాలరీ..

గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మానేరు నీళ్లు తాగిన మా సిరిసిల్ల బిడ్డ వేణు ఇటీవల బలగం సినిమాతో సత్తా చాటాడు. పెద్దపల్లి బిడ్డ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు దసరా సినిమాతో సత్తా చాటాడు. వీళ్ళు కరీంనగర్ జిల్లాని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. తెలంగాణ సాధించడం వల్లే ఇలాంటి మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నాయి. కాసర్ల శ్యామ్ కూడా గొప్ప పాటలు రాస్తూ తెలంగాణ సంసృతిని మరింత వెలుగులోకి తెస్తున్నాడు. నాని ఎక్కడ పుట్టినా ఈ సినిమాతో తెలంగాణ బిడ్డ అయిపోయాడు అంటూ అభినందించారు.