Nayattu Remake: తెలుగు తెరపై మలయాళం హవా.. గీత ఆర్ట్స్ మరో రీమేక్!
మలయాళం సినిమాలు ఇప్పుడు అన్ని బాషలలో సూపర్ హిట్ ఫార్ములా అయిపోతున్నాయి. అక్కడి దర్శక, నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను కాకుండా కాన్సెప్ట్ సినిమాలకు జై కొడతారు. అక్కడి ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. అయితే.. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే దేశం మొత్తం హవా నడుస్తుంది.

Nayattu Remake
Nayattu Remake: మలయాళం సినిమాలు ఇప్పుడు అన్ని బాషలలో సూపర్ హిట్ ఫార్ములా అయిపోతున్నాయి. నిజానికి మలయాళం సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండదు. అందుకే అక్కడి దర్శక, నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను కాకుండా కాన్సెప్ట్ సినిమాలకు జై కొడతారు. అక్కడి ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. అయితే.. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే దేశం మొత్తం హవా నడుస్తుంది.
అందుకే మలయాళ సినిమాల మీద ఓ కన్నేసి ఉంచిన మన సినీ మేకర్స్ నచ్చిన సినిమాల హక్కులను చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటికే అలా అరడజను పైగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో చిరంజీవి ‘లూసిఫర్’, పవన్-రానా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ షూటింగ్ లో ఉండగా రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హక్కులు, సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘కప్పేలా’ హక్కులను దక్కించుకున్నాయి.
ఇవి కాకుండా ఇప్పుడు గీత ఆర్ట్స్ సంస్థ మరో సినిమా హక్కులను దక్కించుకుంది. నాయట్టు అనే మలయాళం సినిమా ఈ మధ్యనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై భారీ వ్యూస్ దక్కించుకుంది. మార్టిన్ ప్రక్కట్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరినీ ఆకర్షించింది. ఇప్పటికే బాలీవుడ్ రైట్స్‌ను జాన్ అబ్రహమ్, తమిళ రైట్స్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంతం చేసుకోగా తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్ దక్కించుకుంది.
నిజానికి ముందు గీతా ఆర్ట్స్ నాయుట్టు హక్కులు కొనగానే దబ్ చేసి ఆహాలో విడుదల చేస్తారని భావించారు. ఇప్పటికే అలా చాలా మలయాళం సినిమాలను ఆహాలో ప్రసారం చేశారు కూడా. కానీ, ఈ సినిమా కాన్సెప్ట్ దృష్ట్యా రీమేక్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తమిళంలో ఇప్పటికే గౌతమ్ మీనన్ స్వయంగా దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుండగా తెలుగులో ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారు.. ఎవరు నటించనున్నారన్నది ఆసక్తిగా మారింది.