ట్రాఫిక్ పోలీసులకు గీతా ఆర్ట్స్ మజ్జిగ పంపిణీ

చల్లటి మజ్జిగ తాగిన పోలీసులు మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది అల్లు అరవింద్‌కి, గీతా ఆర్ట్స్ స్టాఫ్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు..

  • Published By: sekhar ,Published On : May 2, 2019 / 08:03 AM IST
ట్రాఫిక్ పోలీసులకు గీతా ఆర్ట్స్ మజ్జిగ పంపిణీ

చల్లటి మజ్జిగ తాగిన పోలీసులు మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది అల్లు అరవింద్‌కి, గీతా ఆర్ట్స్ స్టాఫ్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హైదరాబాద్ సిటీ పోలీసులకు తనవంతు సహాయం చేస్తూ, అందరి మనసులూ దోచుకున్నారు. ఈ ఎండలో బయటకి వెళ్తే తాగునీటికోసం ఎంత ఇబ్బంది పడతామో, గొంతెండిపోయి తాగడానికి గుక్కెడునీళ్ళు లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మరి, ఎండలో డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ కార్మికుల పరిస్థితి ఏంటి?..

అందుకు అరవింద్ ఒక ఆలోచన చేసి, తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తరపున సిటీలో పలుచోట్ల రోడ్లపై ఎండలో డ్యూటీ చేస్తున్న పోలీసువారికి, జీహెచ్ఎంసీ సిబ్బందికి ఉచితంగా మజ్జిగ బాటిల్స్ పంచుతున్నారు. రోజుకి 200 లీటర్ల మజ్జిగను వారు పంపిణీ చేస్తుండడం విశేషం.. మజ్జిగను బాటిల్స్‌లో పోసి, డ్రమ్ములలో నింపి, తమసొంత కార్లలో తీసుకెళ్ళి మరీ పంచుతున్నారు.

చల్లటి మజ్జిగ తాగిన పోలీసులు మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది అల్లు అరవింద్‌కి, గీతా ఆర్ట్స్ స్టాఫ్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. మే నెలాఖరు వరకు మజ్జిగ పంపిణీ చెయ్యనున్నట్టు గీతా ఆర్ట్స్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.