Mem Famous: ‘మేమ్ Famous’ మూవీని రిలీజ్ చేయబోతున్న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్

లహరి ఫిలింస్ అండ్ చాయ్ బిస్కెట్ ఫిలింస్ బ్యానర్లు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మేమ్ ఫేమస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

Mem Famous: ‘మేమ్ Famous’ మూవీని రిలీజ్ చేయబోతున్న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్

Geetha Film Distribution To Release Mem Famous Movie

Mem Famous: టాలీవుడ్‌లో ఇటీవల ‘రైటర్ పద్మభూషణ్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న లహరి ఫిలింస్ అండ్ చాయ్ బిస్కెట్ ఫిలింస్ బ్యానర్లు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మేమ్ ఫేమస్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుంది. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు సుమంత్ ప్రభాస్. ఈ మూవీలో హీరోగా కూడా సుమంత్ ప్రభాస్ నటిస్తుండగా, ఈ చిత్ర పోస్టర్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.

Mem Famous Teaser : ‘మేమ్ ఫేమస్’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి.. ఫేమస్ అవ్వాలంటే కొట్టాల్సిందే!

ఇక ఈ సినిమాను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను తొలుత జూన్ 2న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది, కానీ మే 26న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

దీంతో ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో తెలియాలంటే మే 26 వరకు వెయిట్ చేయాల్సిందే.