Geetha Madhuri : బిగ్‌బాస్‌ ఓటీటీ ఆఫర్ వచ్చింది.. కాని రెండో సారి పార్టిసిపేట్ చేసే వారు కప్పు గెలవలేరు..

తాజాగా బిగ్‌బాస్‌ పై సీజన్2 రన్నర్, సింగర్ గీతామాధురి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గీతామాధురి మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్‌ ఓటీటీ ఆఫర్ నాకు కూడా వచ్చింది. కానీ నాకు..........

Geetha Madhuri : బిగ్‌బాస్‌ ఓటీటీ ఆఫర్ వచ్చింది.. కాని రెండో సారి పార్టిసిపేట్ చేసే వారు కప్పు గెలవలేరు..

Geetha Madhuri

BiggBoss :  కొన్ని నెలల క్రితమే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్5 ముగిసింది. అంతలోనే బిగ్‌బాస్‌ ఓటిటీ వర్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈ సారి ‘బిగ్‌బాస్‌ నాన్ స్టాప్’ పేరుతో డిస్నిప్లస్ హాట్ స్టార్ లో 24/7 టెలికాస్ట్ అవ్వనుంది. ఫిబ్రవరి 26 సాయంత్రం 6గంటల నుండి ‘బిగ్‌బాస్‌ నాన్ స్టాప్’ మొదలవ్వనుంది. అయితే ఈ సారి కంటెస్టెంట్స్ లో కొత్తవాళ్లతో పాటు కొంతమంది పాత సీజన్లలో పార్టిసిపేట్ చేసిన వారు కూడా ఉండబోతున్నారు. ఇది అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం.

తాజాగా బిగ్‌బాస్‌ పై సీజన్2 రన్నర్, సింగర్ గీతామాధురి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గీతామాధురి మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్‌ ఓటీటీ ఆఫర్ నాకు కూడా వచ్చింది. కానీ నాకు ఇప్పుడున్న కమిట్మెంట్స్ కారణంగా వెళ్లడం లేదు. ప్రొఫెషనల్ గా బిజీగా ఉన్నాను. అంతే కాక నాకు బేబీ కూడా ఉంది. కాని బిగ్‌బాస్‌ షోని ఇష్టపడతాను. ఆ ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొంటే కప్పు కొడతానని నేను అనుకోను.”

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ఐదో షోకు గ్రీన్ సిగ్నల్

”నేను ఆల్రెడీ ఒకసారి బిగ్‌బాస్‌ కి వెళ్ళాను కాబట్టి రెండోసారి వెళితే సెకండ్ హ్యాండ్ అవుతాను. ఆల్రెడీ ఒకసారి షోకి వెళ్లిన వాళ్లకు కప్పు రాదు. ఎందుకంటే ఫ్రెష్ టాలెంట్ కే కప్పు గెలుచుకునే అర్హత ఉంటుంది. అందరూ పాత లేదా అంతా కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్‌ షో నడిపితే ఓకే. కాని ఈసారి పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. పాతవారికి కప్పు గెలిచే అవకాశం ఇస్తే అది కొత్తవాళ్లను అన్యాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే పాత వాళ్లకు అనుభవం ఉంది, వాళ్లతో కొత్తవాళ్లను పోటీకి దించడం కరెక్ట్ కాదు.” అని తెలిపింది.

Nani : నాని ‘అంటే సుందరానికి’ టీజర్ రిలీజ్..

అంటే ఈ లెక్కన గీత మాధురి చెప్పినట్టు కప్పు కొత్తవారికి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఆల్రెడీ బిగ్‌బాస్‌ లో అనుభవం ఉన్నవారు, కొత్తవారు ఎలా ఆడతారో చూడాలి. ‘బిగ్‌బాస్‌ నాన్ స్టాప్’ షో కోసం బిగ్‌బాస్‌ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.