Geetu Royal: RGV భామని ఒక ఆట ఆడుకుంటున్న గీతూ రాయల్

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌-6 సందడి మొదలైంది. ఇక బిగ్‌బాస్‌ మొదటిరోజు నుంచే విభచించు పాలించు అంటూ ‘క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌’.. అనే టాస్క్ తో స్టార్ట్ చేశారు. కాగా రెండోరోజూ ప్రోమో విడుదల చేయగా..బిగ్‌బాస్‌ క్లాస్ టీం మెంబెర్స్ ని, ట్రాష్ టీం మెంబెర్స్ ని పరస్పర మార్పిడి కావాలని కోరారు. క్లాస్ టీంలో ఉన్న ఆదిత్య మాస్ టీంలోకి రాగా, ట్రాష్ టీంలో ఉన్న గీతూ క్లాస్ టీంలోకి వచ్చింది.

Geetu Royal: RGV భామని ఒక ఆట ఆడుకుంటున్న గీతూ రాయల్

Geetu Royal teases a Inaya

Geetu Royal: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌-6 సందడి మొదలైంది. ఇక బిగ్‌బాస్‌ మొదటిరోజు నుంచే విభచించు పాలించు అంటూ ‘క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌’.. అనే టాస్క్ తో స్టార్ట్ చేశారు. క్లాస్‌ వాళ్లకు నేరుగా కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉండగా వారు ఇంటిలోని ఏ పని చేయనక్కర్లేదు, కావాలంటే మిగిలిన ఇంటి సభ్యులతో ఆ పని చేయించుకోవచ్చు. అలాగే బిగ్‌బాస్‌ ఇచ్చిన వీఐపీ బాల్కనీ కూడా వాడుకోవచ్చు. ఇక ట్రాష్ టీమ్‌లో ఉండే సభ్యులు హౌస్‌లోని గార్డెన్ ఏరియాలోనే వండుకుని తినాలి. వీరు నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ అవుతారు, ఇంకా కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కూడా ఉండదు.

BiggBoss6 : మొదటి రోజే గొడవలు మొదలు.. ఈ జుట్టు పంచాయితీ ఏందో.. రెచ్చిపోయిన గీతూ..

ఇక మాస్ టీంలో ఉన్న వాళ్ళకు ఎటువంటి అధికారాలు ఉండవు, అలానే నామినేట్‌ అయ్యే అవకాశం కూడా ఉండదు. సోమవారం క్లాస్ టీంలో ఆదిత్య, సూర్య, శ్రీహాన్ ఉండగా, ట్రాష్ టీంలో ఇనయా, గీతూ, రేవంత్ ఉన్నారు. మిగిలిన ఇంటి సభ్యులు అంతా మాస్ టీంలోని వారు. ఆ తరవాత కొబ్బరిబోండం ఆటతో మొదటిరోజుని ఫుల్ జోష్ తో ముంగిచారు.

కాగా రెండోరోజూ ప్రోమో విడుదల చేయగా..బిగ్‌బాస్‌ క్లాస్ టీం మెంబెర్స్ ని, ట్రాష్ టీం మెంబెర్స్ ని పరస్పర మార్పిడి కావాలని కోరారు. క్లాస్ టీంలో ఉన్న ఆదిత్య మాస్ టీంలోకి రాగా, ట్రాష్ టీంలో ఉన్న గీతూ క్లాస్ టీంలోకి వచ్చింది. దీంతో గీతూ హౌస్‌మేట్స్‌తో ఒక ఆట ఆడుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇనయాను ఆమె కాస్త ఎక్కువగా టార్గెట్ చేస్తూ చేసిన పనులు ఇంటి సభ్యులలో నవ్వులు పూయించిందని ప్రోమోలో కనిపిస్తుంది.