తెలుగులో ‘జెమిని మ్యాన్’ – అక్టోబర్ 11న విడుదల

విల్‌స్మిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జెమిని మ్యాన్’.. 2019 అక్టోబర్‌11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : October 3, 2019 / 10:24 AM IST
తెలుగులో ‘జెమిని మ్యాన్’ – అక్టోబర్ 11న విడుదల

విల్‌స్మిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జెమిని మ్యాన్’.. 2019 అక్టోబర్‌11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

ఫేమస్ హాలీవుడ్‌ యాక్టర్ విల్‌స్మిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జెమిని మ్యాన్’.. ‘లైఫ్ ఆఫ్ పై’ మూవీకి ‘అకాడెమీ అవార్డు’ అందుకున్న ఆంగ్ లీ డైరెక్షన్‌లో, జెర్రీ బ్రక్‌హెమెర్, డేవిడ్ ఎల్సన్, డానా గోల్డ్‌బెర్గ్, డాన్ గ్రాన్గర్ ప్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘జెమిని మ్యాన్’.. తెలుగులోనూ విడదలవుతోంది. ఇన్నోవేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విల్ స్మిత్ నటన, డియాన్ విజువల్స్, మార్కో మ్యూజిక్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ అండ్ అడ్వెంచరస్ సీన్స్ హైలెట్ అవుతాయని మేకర్స్ చెప్తున్నారు.

Read Also : ‘లక్ష్మీబాంబ్’ – అక్షయ్ అదరహో!

మేరీ ఎలిజబెత్, బెనెడిక్ట్ వాంగ్ తదితరులు నటిస్తున్నారు. పారామౌంట్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న జెమిని మ్యాన్ 2019 అక్టోబర్‌11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.