Mahesh Babu : మహేష్‌బాబు కోసం స్పెషల్ ఫుడ్ పంపిన జెనీలియా

తాజాగా జెనీలియా దంపతులు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు 'ఇమేజిన్ మీట్స్' ఫుడ్ ఐటమ్స్ ని పంపించారు. దీనిపై మహేశ్ బాబు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 'ఇమేజిన్ మీట్స్'

Mahesh Babu : మహేష్‌బాబు కోసం స్పెషల్ ఫుడ్ పంపిన జెనీలియా

Mahesh

Mahesh Babu :  తెలుగులో ఒకప్పుడు జెనీలియా చేసిన సందడి అంతా ఇంతా కాదు. జెనీలియా చేసిన తెలుగు సినిమాల్లో చాలా వరకు మంచి విజయం సాధించాయి. ‘సై’, ‘హ్యాపీ’, ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’, ‘ఆరంజ్’… లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది. సినిమాలకి దూరం అయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది.

Nayanatara : ప్రియుడితో కలిసి అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న నయన్

తెలుగు సినిమాల నుంచి దూరమైనా ఇక్కడి వాళ్ళతో మంచి స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. ఇటీవల మంచు విష్ణు కోసం ‘మా’ ఎలక్షన్స్ కి వచ్చి ఓటు కూడా వేసింది. ఇటీవల జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ దంపతులు కొత్త బిజినెస్ ని ప్రారంభించారు. ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో మాసం తినని వాళ్ళ కోసం అదే టేస్ట్, అవే న్యూట్రీషియన్స్ ఉండే వెజ్ ఐటమ్స్ ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఈ బిజినెస్ ప్రమోషన్స్ లో భాగంగా తమ ఫుడ్ ని సెలబ్రిటీలకు గిఫ్ట్ గా పంపిస్తున్నారు.

Prabhas : ప్రభాస్ పేరుతో అభిమాని హెయిర్ స్టైల్.. ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్

తాజాగా జెనీలియా దంపతులు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ‘ఇమేజిన్ మీట్స్’ ఫుడ్ ఐటమ్స్ ని పంపించారు. దీనిపై మహేశ్ బాబు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘ఇమేజిన్ మీట్స్’ పంపించినందుకు కృతజ్ఞతలు. వీటిని వెంటనే టేస్ట్ చేయాలి అనే ఆత్రుతతో ఉన్నానని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. తన పట్ల అభిమానంతో పంపించినందుకు థ్యాంక్స్ చెబుతూ జెనీలియా, రితేష్ ని ట్యాగ్ చేశాడు.