‘‘జార్జ్ రెడ్డి’’ సెన్సార్ పూర్తి

‘‘జార్జ్ రెడ్డి’’ సెన్సార్ పూర్తి - సినిమా చూసిన సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ జారీ చేశారు..

10TV Telugu News

‘‘జార్జ్ రెడ్డి’’ సెన్సార్ పూర్తి – సినిమా చూసిన సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ జారీ చేశారు..

‘‘జార్జ్ రెడ్డి’’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఓయూ లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమా చూసిన సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ జారీ చేశారు.
సినిమా నిడివి 153 నిమిషాలు.. ‘జార్జ్ రెడ్డి’లో ఎమోషన్స్‌తో పాటు పలు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. జార్జ్ రెడ్డిగా ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ నటించిన విషయం తెలిసిందే. 25 ఏళ్లకే ఓయూ లో దారుణంగా హత్య చేయబడ్డ జార్జ్ రెడ్డి మరణానికి దారి తీసిన కారణాలు ఈ సినిమాలో చూపించనున్నారు. సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.

Read Also : తమిళనాట ‘‘బాహుబలి : ది బిగినింగ్’’ రీ-రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా సాంగ్‌ని రిలీజ్ చేసి మంచి బూస్ట్ ఇవ్వగా మరికొంత మంది హీరోలు, దర్శకులు చిత్ర యూనిట్‌కి స్పెషల్ విషెస్ అందించారు. ఇక సినిమాలో సత్యదేవ్ మరొక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన జార్జ్ రెడ్డి చిత్రాన్ని అప్పి రెడ్డి – సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.