జార్జ్ రెడ్డి సినిమాను అడ్డుకుంటాం : ఏబీవీపీ నేతల అభ్యంతరం

‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో వివాదం నెలకొంది.. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ.. ఏబీవీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..

10TV Telugu News

‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో వివాదం నెలకొంది.. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ.. ఏబీవీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు ఏదైనా ఒక సీన్‌లో కానీ, డైలాగులో కానీ, చివరికి బ్యాగ్రౌండ్‌లో కానీ పొరపాటున తమ కమ్యూనిటీకి సంబంధించి ఏదైనా ఒక చిన్న అంశాన్ని గమనించారా.. ఇక దర్శక, నిర్మాతలకు చెమటలే.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్.. మమ్మల్ని తక్కువగా చూపించారు.. అదీ, ఇదీ తప్పంతా మీదే అంటూ మీడియాకెక్కి నానా రచ్చ చేస్తుంటారు. ఇటీవలే వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా తెల్లారితే రిలీజ్ అనగా రాత్రికి రాత్రి ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే చూసుకోండి మరి..

ఇప్పుడు ‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో వివాదం నెలకొంది. విద్యార్థి దశలో ఉస్మానియాలో పెను సంచలనం సృష్టించిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా.. ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో.. సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా, మైక్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో ఏబీవీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Read Also : అడ్డాల దర్శకత్వంలో ‘అసురన్’ రీమేక్

‘ఈ సినిమా దర్శక, నిర్మాతలు ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారు.. జార్జిరెడ్డిపై కూడా దాదాపు 15 క్రిమినల్ కేసులున్నాయి.. మరి ఆయన రౌడీయిజాన్ని కూడా చూపించండి.. కల్పిత ధోరణిలో ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటాం.. అయినా జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థుల హస్తం లేదని కోర్టు గతంలోనే తీర్పునిచ్చిందనే విషయాన్ని గుర్తులేదా.. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు మళ్లీ వివాదం చేయడానికి, ఏబీవీపీ నేతలను తప్పుగా చూపించడానికే ‘జార్జిరెడ్డి’ సినిమా తీస్తున్నారు’ అంటూ ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

‘మా సినిమాలో నిజాలనే చూపిస్తున్నాం.. పర్సనల్‌గా ఎవరినీ టార్గెట్ చేయలేదు’ అని దర్శకులు జీవన్ రెడ్డి చెప్తున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 22న ‘జార్జ్ రెడ్డి’ రిలీజ్ కానుంది..

10TV Telugu News