రేపు జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడు: డైరెక్టర్ జీవన్‌రెడ్డి

శుక్రవారం ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించింది..

  • Published By: sekhar ,Published On : November 21, 2019 / 10:15 AM IST
రేపు జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడు: డైరెక్టర్ జీవన్‌రెడ్డి

శుక్రవారం ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించింది..

‘‘జార్జ్ రెడ్డి’’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఓయూ లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చిత్రయూనిట్ జార్జిరెడ్డి సమాధిని సందర్శించింది. నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద చిత్ర బృందం నివాళులు అర్పించింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జార్జిరెడ్డి జీవిత చరిత్ర తెలుసుకున్నాక ఐదేళ్లు ఏ సినిమా చేయలేదు. ఆయన నిజాయితీ చెప్పేందుకే ఈ సినిమా తెరకెక్కించాము. నేను నాకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తి జార్జిరెడ్డి. రేపు ‘జార్జిరెడ్డి’ సినిమా విడుదల అవుతోంది. ఆయన మళ్లీ పుడుతున్నాడు. ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.’’ అన్నారు.

Read Also : అక్కినేని అభిమానులకు చైతు బర్త్‌డే ట్రీట్ రెడీ!

కో- ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయన చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని రెండేళ్లు ఈ సినిమాను చిత్రీకరించాము. సమాజంలో జార్జిరెడ్డి లాంటి వాళ్లను చాలామందిని కోల్పోయాం. అలాంటి వీరులను ఎలా కోల్పోయామో తెలియజేసేందుకే ఈ సినిమా నిర్మించాము. జార్జిరెడ్డి 25 ఏళ్లకే ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను ప్రజలకు కనెక్ట్ చేసేందుకు ఛాలెంజింగ్‌గా తీసుకుని పని చేశాం.’’ అని చెప్పుకొచ్చారు. జార్జ్ రెడ్డి చిత్రాన్ని అప్పి రెడ్డి – సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.