Charmi : పెళ్లిపై ఛార్మి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన పంజాబీ బ్యూటీ ఛార్మి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Charmi : పెళ్లిపై ఛార్మి షాకింగ్ కామెంట్స్

Charmi

Charmi Wedding : టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన పంజాబీ బ్యూటీ ఛార్మి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈమె వివాహంపై రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోందంట..సమీప బంధువుని త్వరలోనే వివాహమాడుతుందని, పెళ్లి పీఠలపై ఎక్కబోతోందని ఇలా..రకరకాల గుసగుసలు వినిపించాయి.

ఈ క్రమంలో దీనిపై ఛార్మీ స్పందించారు. ప్రస్తుతం కెరీర్ హాయిగా సాఫీగా సాగిపోతోందని, ఈ లైఫ్ తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. నా జీవితం చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చేసుకోవ‌డం అనే త‌ప్పు నా జీవితంలో ఎప్ప‌టికీ చేయ‌నంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది ఛార్మి. ఫేక్ రైటర్స్ కూడా స్పందించారామె.

ఇక ఛార్మీ విషయానికి వస్తే…తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన అందచందాలు..నటనతో యువతను అట్రాక్ట్ చేశారు. అయితే..షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతగా అవతారమెత్తారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకొంటోంది. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘లైగర్’ సినిమాను పూరితో కలిసి నిర్మిస్తున్నారు ఈ బ్యూటీ ఛార్మి.

Read More : China Rocket: చైనా రాకెట్ కూలింది.. పెను ప్రమాదమే తప్పింది