Ghani : నిన్నెంటి.. మొన్నెంటి.. నీకెందుకు.. ‘గని’ నుంచి అదిరిపోయే ఇన్స్పిరేషనల్ సాంగ్

'గని' సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ వచ్చాయి. ఈ సినిమాని డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా

Ghani : నిన్నెంటి.. మొన్నెంటి.. నీకెందుకు.. ‘గని’ నుంచి అదిరిపోయే ఇన్స్పిరేషనల్ సాంగ్

Gani

Ghani :  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుంచి కూడా ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నాడు. అందరి లాగా కమర్షియల్ సినిమాల వైపు వెళ్లకుండా కొత్త కథలకి కమర్షియల్ అంశాలని జోడిస్తూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడున్న యువ హీరోలలో, అందులోను మెగా హీరోలలో కొత్తగా సినిమా చేయాలి అంటే వరుణ్ తేజ్ తర్వాతే ఎవరైనా. వరుణ్ చివరగా 2019లో గద్దలకొండ గణేష్ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ‘గని’ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. కానీ కరోనా వల్ల సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తుంది. సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఒక పక్క ‘గని’ సినిమా షూటింగ్ కి హాజరవుతూనే మరో పక్క ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు వరుణ్.

Manchu Manoj : నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి : మంచు మనోజ్

‘గని’ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ వచ్చాయి. ఈ సినిమాని డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి గని యాంతం అంటూ టైటిల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ లా ఉంది. సాంగ్ లో మాస్ బీట్ తో పాటు ర్యాప్ మిక్స్ చేశారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సాంగ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ కచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఈ పాట మొత్తం వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు, కోచ్ ప్రాక్టీస్ చేపిస్తున్నట్టు ఉంది. ఈ పాటకి మంచి స్పందన వస్తుంది. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.