Giribabu: విచిత్ర కథ పుస్తకం.. చిరు, మోహన్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

హీరోగా.. కమెడియన్ గా.. సీనియర్ నటుడిగా.. దర్శక నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు గిరిబాబు చాలా సుపరిచతం. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా అలరించిన గిరిబాబు.. ఇప్పటికీ అడపాదడపా పాత్రలతో..

Giribabu: విచిత్ర కథ పుస్తకం.. చిరు, మోహన్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Giribabu

Giribabu: హీరోగా.. కమెడియన్ గా.. సీనియర్ నటుడిగా.. దర్శక నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు గిరిబాబు చాలా సుపరిచతం. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా అలరించిన గిరిబాబు.. ఇప్పటికీ అడపాదడపా పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిన గిరిబాబు తన వారసుడిగా తనయుళ్లను రఘుబాబు, బోసుబాబులను కూడా నటులగా పరిచయం చేయగా రఘుబాబు బిజీ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలలో నటిస్తున్నాడు. ఏ పాత్రకైనా న్యాయం చేయగలడనే పేరున్న గిరిబాబు త్వరలో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.

Anchor Ravi: ఆ రూ.45 లక్షలు.. మోసపోయిన రవికి అదే బాధ!

తన సుదీర్ఘ సినీ జీవితంతో పాటు కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎదిగిన తీరుతో పాటు పస్తులున్న రోజులను కూడా గుర్తుచేసుకుంటూ తన జీవితాన్ని ఈ పుస్తకంలో వెల్లడించనున్నారు. ఈ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గిరిబాబు మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు తాను రూమ్మేట్స్ కాగా మురళీ మోహన్, శరత్ బాబు స్నేహితులుగా ఉండేవాళ్లని.. చిరంజీవి చాలా కాలం తర్వాత ఇండస్ట్రీకి వస్తే.. తనకి సినిమా ఛాన్స్ వచ్చాక రెండేళ్లకి మోహన్ బాబుకి తొలి అవకాశం వచ్చిందని చెప్పారు.

Tollywood New Releases: అఖండ ఊపు.. ఇక బాక్సాఫీస్‌పై టాలీవుడ్ యుద్ధమే!

ఇప్పటికీ తన స్నేహితులను కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటామన్న గిరిబాబు.. చిరంజీవి తనకంటే చాలా ఆలస్యంగా ఇండస్ట్రీకి వచ్చినా ఎలాంటి మచ్చలేని మనిషిగా మెగాస్టార్ అనే పేరుకు సార్థక నామధేయుడేనని చెప్పారు. చిరంజీవి చాలా మంచి మనిషి, మంచి ఆర్టిస్టు, నాకు మంచి మిత్రుడన్న గిరిబాబు నేను అంటే ఆయనకి ఎంతో ఇష్టమని.. ఎక్కడ కనిపించినా ఎంతో ఆత్మీయంగా హగ్ చేసుకుంటాడని.. అహంభావానికి దూరంగా.. అందరితో సామరస్యంగా ఉండేమనిషి చిరంజీవని చెప్పారు. మరి ఆ పుస్తకంలో ఇంకెన్ని రాశారో తెలియాలంటే రానున్న సంక్రాంతి వరకు ఆగాలి.