F3: గ్లామర్ ప్యాకేజ్.. మెహ్రీన్, తమన్నాకు తోడైన సోనాల్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. వెంకటేష్ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ పంచ్ లు.. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్..

F3: గ్లామర్ ప్యాకేజ్.. మెహ్రీన్, తమన్నాకు తోడైన సోనాల్!

F3

F3: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. వెంకటేష్ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ పంచ్ లు.. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటులు తోడవడంతో అనిల్ రావిపూడి కథ ఎక్కడికో వెళ్ళింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. సెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Prabhas: మేకర్స్ హంటింగ్.. ప్రభాస్ విలన్స్ అంటే మాటలా!

కాగా, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లకు తోడు టైటిల్ కు తగ్గట్లే మరో హీరో, హీరోయిన్ కూడా జాతకానున్నారని చాలా కాలంగా వినిపిస్తూ వస్తుంది. అయితే, హీరో సంగతేమో కానీ మరో హీరోయిన్ ఈ సినిమాలో భాగం అయిందని అధికారికంగా ప్రూవ్ అయింది. ఎఫ్ 3లో తమన్నా, మెహ్రీన్ లతో పాటు సౌనాల్ చౌహన్ కూడా కనిపించనుంది. ఈ సినిమాలో తను భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోనాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్ లకు థాంక్స్ చెబుతూ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ లతో కలిసి నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.

Malaika Arora: ముసలామె అంటూ ట్రోల్స్.. కామెంట్స్ ఆపేసిన మలైకా!

సోనాల్ పోస్టును రీ పోస్ట్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 కుటుంబంలోకి స్వాగతం చెప్పాడు. సోనాల్ ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అనిల్ పేర్కొన్నాడు. అయితే.. సోనాల్ ఇందులో అతిధి పాత్రతో పాటు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని కొందరు.. కాదు కాదు.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కు స్కోప్ ఉందని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఇందులో ఏది నిజమన్నది తేలాలంటే మాత్రం ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.