Gollapudi Maruthi Rao Wife: గొల్లపూడి మారుతీరావు భార్య కన్నుమూత
సీనియర్ నటులు, దివంగత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి(81) కన్నుమూశారు.

Gollapudi Maruthi Rao Wife: సీనియర్ నటులు, దివంగత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్ వీధిలో నివసిస్తున్న ఆమె.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని గొల్లపూడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది. రామభక్తురాలైన శివకామ సుందరి మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు చెప్పారు.
2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూసిన తర్వాత శివకామసుందరి తన కొడుకు సుబ్బారావు ఇంట్లో ఉంటున్నారు.
గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతులకు ఇద్దరు కుమారులు.. వారిలో ఒక కుమారుడు వైజాగ్‌లో ప్రమాదంలో చనిపోయారు.
మారుతీరావు నాటకరంగం నుంచి సినిమారంగం వైపు వచ్చి.. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. కథలు, నవలా రచనతో పాటు జర్నలిస్ట్, టివి యాంకర్, స్క్రీన్ రైటర్, యాక్టర్, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాల్లో పనిచేశారు.
కామెడీ, విలన్, సెంటిమెంట్ పాత్ర ఏదైనా తన నటనతో పాత్రకే వన్నె తీసుకొచ్చేవారు గొల్లపూడి.
- Nalgonda : అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం
- Mohammed Karimunnisa : వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా కన్నుమూత
- West Bengal : పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత
- Producer Annamreddy : సినిమా విడుదలకు ముందే.. నిర్మాత అన్నంరెడ్డి కన్నుమూత
- Oxygen Shortage : రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు, ఆక్సిజన్ అందక పలువురి మృతి?
1Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య