బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్: మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. ట్రైనింగ్ అక్కడే!

  • Published By: vamsi ,Published On : February 13, 2020 / 04:17 AM IST
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్: మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. ట్రైనింగ్ అక్కడే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. బాలకృష్ణ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని స్టార్ హీరోలుగా మారారు. కళ్యాణ్ రామ్, తారకరత్నలు కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అయితే వీరంతా వచ్చి దశాబ్ధం దాటిపోయింది. అయితే ఈ ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తున్నారు. 

నందమూరి కుటుంబంలో నుంచి వచ్చే అవకాశం ఉన్న యంగ్ హీరో నందమూరి మోక్షజ్ఞ. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. బాలయ్య కూడా ఎప్పటికప్పుడు తన కుమారుడి సినిమా గురించి చెబుతూనే ఉన్నాడు కానీ  ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం ప్రకటించలేదు. ఈ క్రమంలో నందమూరి మోక్షజ్ఞ అసలు నటనపై ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పుడు ఆ వార్తలకు చెక్ చెప్పేందుకు సిద్ధం అయ్యాడు బాలయ్య. తన కొడుకుని ఈ ఏడాదిలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే అమెరికా పంపించి నటనలో శిక్షణ ఇప్పించనున్నాడు. న్యూయార్క్‌లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ ఇప్పించి, మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకుని రావాలని బాలయ్య భావిస్తున్నారట. ఇదేగాని జరిగితే బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.