Cinema: సినిమా వాళ్లకు తెలంగాణలో గుడ్ న్యూస్.. ఏపీలో షాక్!

తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమకు ఓ రాష్ట్రంలో గుడ్‌న్యూస్‌ లభించగా మరో రాష్ట్రంలో ఊహించని షాక్‌ తగిలింది.

Cinema: సినిమా వాళ్లకు తెలంగాణలో గుడ్ న్యూస్.. ఏపీలో షాక్!

Tickets

Cinema: తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమకు ఓ రాష్ట్రంలో గుడ్‌న్యూస్‌ లభించగా మరో రాష్ట్రంలో ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణలో టికెట్‌ ధరలను పెంచడానికి హైకోర్టు అనుమతివ్వగా.. ఏపీలో మాత్రం కొత్త ధరలను ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటికే బెన్‌ఫిట్ షోలకు అనుమతులు రద్దు చేసిన ఏపీ సర్కారు.. లేటెస్ట్‌గా మరో షాక్ ఇచ్చింది. ఏపీలో టికెట్స్‌కి ఖచ్చితమైన ధరలను నిర్ణయిస్తూ ఓ పట్టికను విడుదల చేసింది ప్రభుత్వం.

5, 10, 15 రూపాయల నుంచి రూ.250 వరకు టికెట్‌ రేట్లను ఫిక్స్‌ చేసింది ప్రభుత్వం. గ్రామ పంచాయితీ పరిధిలో థియేటర్లో ఎకనామీ టికెట్ రూ.5గా నిర్ణయించగా.. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మల్టీప్లెక్స్ థియేటర్‌లో ప్రీమియం టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు.

Suicide : పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం హైకోర్టు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. టికెట్ల ధరలను పెంచేందుకు థియేటర్లకు అనుమతులు ఇచ్చింది హైకోర్టు. థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. అఖండ, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప తదితర బడ్జెట్‌ సినిమాలకు ధరలు పెంచుతామని థియేటర్ల యాజమన్యాలు తెలిపాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలంటూ విజ్ఞప్తి చేశాయి.

Sirivennela : స్వర్గంలో కలుద్దాం.. త్వరలో నేనూ వస్తా.. ఆర్జీవీ ట్వీట్

అయితే.. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన ధర్మాసనం ఒక్కో టికెట్‌పై 50రూపాయల మేర పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.