Acharya: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న..

Acharya: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్

Acharya

Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్, లాహే లాహే సాంగ్ వంటి ప్రమోషనల్ క్యాంపెయిన్స్‌కి భారీ స్పందన కనిపించింది.

Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా ఒకటి కాగా కొరటాల శివ లాంటి కమర్షియల్ దర్శకుడికి చిరంజీవి తోడైతే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్లే కొరటాల రామ్ చరణ్, కాజల్, పూజాహెగ్డేలను కూడా జత చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కడో ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆచార్య వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

నిజానికి కరోనా సెకండ్ వేవ్ తర్వాత దాదాపుగా అందరూ వారి వారి సినిమాల కోసం స్లాట్స్ బుక్ చేసుకుంటుంటే.. ఆచార్య టీం మాత్రం ఇప్పటి వరకూ మౌనంగా వారి పని వారు చేసుకుంటున్నారు. లైవ్ లో ఉన్న బడా బడా సినిమాలన్నీ ఇప్పటికే దసరా, క్రిస్టమస్, సంక్రాంతికి లాక్ చేసుకుంటే కొరటాల మాత్రం తీరిగ్గా సినిమాలేవీ అడ్డు లేకుండా ఫిబ్రవరిలో విడుదలకు బడా ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తుంది. ఎలాగూ పెద్ద సినిమాలేవీ లేని సమయం కావడంతో పాజిటివ్ టాక్ దక్కినా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.