ఈసారి ‘పక్కా కమర్షియల్’ అంటున్న గోపిచంద్..

ఈసారి ‘పక్కా కమర్షియల్’ అంటున్న గోపిచంద్..

Pakka Commercial: మ్యాచో హీరో గోపీచంద్‌, మారుతి కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యు.వి క్రియేషన్స్, జి ఎ2 పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కమర్షియల్ కాన్సెప్ట్‌కి కామెడీని యాడ్ చేసి ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే’ లాంటి హిట్ సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ మారుతి.. డైరెక్ట్ చేస్తున్న 10 వ సినిమా ఇది.. గోపిచంద్ 29వ సినిమా ఇది. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ఫస్ట్ టైమ్ హిలేరియస్ కామెడీతో కమర్షియల్ ఎంటర్‌టైనర్ మారుతి డైరెక్షన్లో చేస్తున్న ఈ చిత్రానికి ‘పక్కా కమర్షియల్’ అనే పేరు ఫిక్స్ చేశారు.

మార్చి 5 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం : జేక్స్ బిజోయ్, ఎడిటింగ్ : ఎస్ బి ఉద్ధవ్.