Jayam Movie : గోపీచంద్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా??

ఇంటర్వ్యూలో గోపీచంద్ తన మొదటి పారితోషికం గురించి మాట్లాడారు. గోపీచంద్ మాట్లాడుతూ.. ''నేను విలన్ గా చేసిన జయం సినిమాకి నా చేతుల్తో మొదటిసారి..............

Jayam Movie : గోపీచంద్ మొదటి పారితోషికం ఎంతో తెలుసా??

Gopichand

Gopichand :  విలన్ గా కెరీర్ మొదలు పెట్టి, హీరోగా మారి వరుస హిట్లు సాధించాడు గోపీచంద్. ఆ తర్వాత కెరీర్ లో కాస్త తడబడ్డా మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. గోపీచంద్, రాశిఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే సాంగ్స్, ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా వీటికి మంచి స్పందన లభించింది. కామెడీ, మాస్ అంశాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

SDT 15 : సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా స్టోరీ ఇదేనా.. ఫస్ట్ లుక్ రిలీజ్..

ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ తన మొదటి పారితోషికం గురించి మాట్లాడారు. గోపీచంద్ మాట్లాడుతూ.. ”నేను విలన్ గా చేసిన జయం సినిమాకి నా చేతుల్తో మొదటిసారి పారితోషికం తీసుకున్నాను. జయం డైరెక్టర్ తేజ లక్కీ నంబర్ 11 అంట. అందుకే నాకు పదకొండు వేల చెక్ ఇచ్చారు. వాటిని అలా చూసి ఇంకో సున్నా పెడితే బాగుండు అనుకున్నాను. ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో ఇచ్చేశాను. వాళ్ళు దేనికి ఖర్చు పెట్టుకున్నారో నాకు తెలీదు” అని తెలిపాడు.