Seetimaarr: సత్తా చాటిన గోపీచంద్.. పాజిటివ్ వైబ్ ఇచ్చిన సీటీమార్!

సౌత్ కా సత్తా మార్ కే నహీ.. సీటీ మార్ కే దిఖావో అని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన గోపీచంద్.. తన సత్తాని కూడా అదే రేంజ్ లో చూపించాడు. చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని..

10TV Telugu News

Seetimaarr: సౌత్ కా సత్తా మార్ కే నహీ.. సీటీ మార్ కే దిఖావో అని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన గోపీచంద్.. తన సత్తాని కూడా అదే రేంజ్ లో చూపించాడు. చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ మాంచి మాస్ హిట్ తో కమ్ బ్యాక్ అయ్యాడు ఈ మ్యాచో మ్యాన్. అంతేకాదు.. కోవిడ్ టైమ్ లో సినిమా రిలీజ్ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నవాళ్లకి మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చాడు.

Big Boss 5: నక్క టీమ్.. గద్ద టీమ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు!

మాస్ హీరో గోపీచంద్ చాలా కాలంగా ఎదురుచూసి లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే, రావడం రావడమే అదిరిపోయే హిట్ దెబ్బతో అబ్బా అనిపించాడు. పవర్ ఫుల్ స్టోరీతో పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ తో వచ్చిన సీటీ మార్ మూవీ సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. జిల్ సినిమా తర్వాత గోపీచంద్ కు పర్వాలేదనిపించిన సినిమాలే కానీ సక్సెస్ అన్న సినిమాలు లేవు. దీంతో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్.. వినాయక చవితికి రిలీజ్ అయిన సీటీమార్ తో కమ్ బ్యాక్ అయ్యాడు.

Prabhas: ప్రభాస్ బాడీ బిల్డింగ్ తిప్పలు.. రెస్ట్ కోసం ఫారిన్ టూర్?

మాస్ యాక్షన్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న గోపిచంద్‌, మాస్ హీరోకు కావల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. భారీ బడ్జెట్ తో ఎనర్జిటిక్ పర్ ఫామెన్స్ ఇస్తున్నా.. అనుకున్న సక్సెస్ మాత్రం రాలేదు. అందుకే ఈ సారి రొటీన్ కమర్షియల్ సనిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో ఆడియన్స్ ముందుకొచ్చి ఆటతో పాటు ఆడియన్స్ మనసు కూడా గెలిచారు. మంచి కలెక్షన్లు రావడంతో మిగతా సినిమాలు కూడా రిలీజ్ గురించి ఆలోచనలో పడ్డాయి.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

ఆరేడేళ్లగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేసిన గోపీచంద్ కి ఇన్నాళ్లకి సక్సెస్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, ఇలాంటి సమయంలో గోపీచంద్ హిట్ తనకే కాకుండా మిగతా హీరోలకు కూడా హోప్ ఇస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరవాత సినిమాలు రిలీజ్ చెయ్యడానికి భయపడుతున్న స్టార్లకి, మేకర్లకు గోపిచంద్ పర్లేదు సినిమాలు రిలీజ్ చేస్కోవచ్చని పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాడు.

10TV Telugu News