Gossips : సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??

పెద్ద పెద్ద విలన్స్ కి తేలిగ్గా చెక్ పెట్టే హీరోలు, కంటి చూపుతోనే పడేసే హీరోయిన్లు సోషల్ మీడియా పేరు చెబితే వణికిపోతున్నారు. అదిగో పెళ్లి, ఇదిగో బ్రేకప్ అంటూ ఇష్టం వచ్చిన గాసిప్ క్రియేట్ చేస్తున్నారు...........

Gossips : సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??
ad

Gossips :  పెద్ద పెద్ద విలన్స్ కి తేలిగ్గా చెక్ పెట్టే హీరోలు, కంటి చూపుతోనే పడేసే హీరోయిన్లు సోషల్ మీడియా పేరు చెబితే వణికిపోతున్నారు. అదిగో పెళ్లి, ఇదిగో బ్రేకప్ అంటూ ఇష్టం వచ్చిన గాసిప్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు. స్టార్స్ మాత్రం రూమర్స్ కి సమాధానం చెప్పుకోలేక తిప్పలు పడుతున్నారు.

ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీల మీద రూమర్స్ మరీ ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రామ్ ఒకరు. అయితే రామ్ పెళ్లి, తన స్కూల్ ఫ్రెండ్ తో రహస్యంగా జరగనుందనే వార్తలు గుప్పుమన్నాయి. దాంతో రామ్ ట్విట్టర్ లోకి దిగి.. ఓరి దేవుడా ఇక చాలు ఆపండి. హై స్కూల్ ఫ్రెండ్ ను, నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నాననే వార్తలు మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు చేరాయి. అలాంటిదేం లేదని వాళ్లను కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంకా నిజం చెప్పాలంటే నేను స్కూల్ కి కూడా సరిగా వెళ్లేవాణ్నే కాదు అని రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు రామ్.

Malavika Mohanan : అందాలతో మెరిపిస్తున్న మాళవిక మోహనన్

మొన్నా మధ్య పూజా హెగ్డే బీస్ట్ సినిమాలో నటించింది. ఆ టైమ్ లో ఆమె స్టాఫ్ ఓ 20 మందిని తీసుకొచ్చి నిర్మాతకు భారం అయిందని, ఫుడ్ బిల్సే లక్షల్లో అయ్యిందని, దాంతో ఆ ప్రొడ్యూసర్, బిల్స్ అన్నీ పూజాకే పంపించారని రూమర్స్ వచ్చాయి. ఈ విషయంలో పూజా వివరణ ఇవ్వలేదు. మరి ఇది నిజమో కాదో తెలీదు.

రష్మిక విషయంలో మరో రూమర్ తెగ వైరల్ అయ్యింది. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మిషన్ మజ్ను సినిమా షూట్ కోసం వెళ్తున్న రష్మిక తన పెట్ డాగ్ కోసం కూడా నిర్మాతల నుంచి ఫ్లయిట్ టికెట్ డిమాండ్ చేసింది అని. అయితే దీనికి రష్మిక ట్విట్టర్ లో స్పందించి, గట్టిగా సమాధానం చెప్పింది. తన డాగ్ హైదరాబాద్ లో హాపీగా ఉంది. తనతో ట్రావెల్ చేయడానికి ఇష్టపడదని, ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసినవాళ్లకు దండంరా బాబు అంటూ ట్వీట్ చేసింది.

Vijay Devarakonda : విజయ్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. వీపుపై విజయ్ దేవరకొండ టాటూ..

సీనియర్ నటీనటులు నరేశ్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇద్దరూ సీరియస్ గానే స్పందించారు. నరేశ్ మీడియాతో మాట్లాడి ఇవన్నీ అబద్దం అని చెప్తే పవిత్ర ఏకంగా సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది.

సింగర్స్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్ కూడా తెగ వైరల్ అయ్యింది. దానికి హేమ చంద్ర, శ్రావణ భార్గవి విడివిడిగా ఇన్ స్టాలో ఘాటుగానే స్పందించి ఆ వార్తలని కొట్టిపారేశారు. ఇలా ఇటీవల చాలా మంది సెలబ్రిటీల మీద ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని ఖండిస్తుంటే మరికొంతమంది ఇలాంటివి కామన్ అని వదిలేస్తున్నారు.