Online Cinema Tickets : ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టిక్కెట్లు.. మొత్తం రెడీ అంటున్న ఏపీ ప్రభుత్వం..

ఏపీలో గతంలో సినిమా టికెట్ల వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా టికెట్ల విషయంలో కొత్త జీవోని విడుదల చేసి టికెట్ రేట్లని పెంచారు. దీనిపై టాలీవుడ్ కూడా హర్షం వ్యక్తం......

Online Cinema Tickets : ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టిక్కెట్లు.. మొత్తం రెడీ అంటున్న ఏపీ ప్రభుత్వం..

Ap Online Cinema Tickets

Online Cinema Tickets :  ఏపీలో గతంలో సినిమా టికెట్ల వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా టికెట్ల విషయంలో కొత్త జీవోని విడుదల చేసి టికెట్ రేట్లని పెంచారు. దీనిపై టాలీవుడ్ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇక సినిమా టికెట్లని ప్రభుత్వమే అమ్ముతుందని గతంలోనే తెలియచేసారు. దీనికి ప్రభుత్వం తరుపున ఆన్లైన్ టికెట్ పోర్టల్ ఉంటుందని తెలిపారు.

ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్లు అమ్మడానికి సంస్థల్ని టెండర్లకి ఆహ్వానించింది. దీనికోసం పలు కంపెనీలు పోటీ పడ్డాయి. చివరగా ఈ టెండర్లలో జస్ట్ టికెట్ సంస్థ నిలిచి ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్స్ నిర్వహణని సొంతం చేసుకుంది. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ కాస్ట్ తో ప్రభుత్వమే దీనిని నిర్వహించబోతుంది. ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ లో సినిమా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Oscar Awards : ఆస్కార్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఫైర్.. కమిటీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మేలా చేస్తామన్నారు ప్రభుత్వ నిర్వాహకులు. ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం కూడా ఉండదని తెలిపారు. అయితే ఈ ఆన్లైన్ టికెట్ విధానంలో డబ్బులు ప్రభుత్వంకి రాగా వాటిని తర్వాత థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారని తెలిపారు. దీనిని ఇప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ కొత్త ఆన్లైన్ టికెట్ విధానం ఎలా ఉండబోతుందో, ఎవరికీ లాభం చేకురుస్తుందో, ఎవరికీ నష్టం చేకురుస్తుందో చూడాలి. ప్రభుత్వమే ఆన్లైన్ టికెట్స్ అమ్మితే బుక్ మై షో, పేటీఎమ్ లాంటి సంస్థలు ఏపీలో ఉంటాయో, ఉండవో అని సందేహిస్తున్నారు.