Cinemas: సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. జగన్ సర్కారు కీలక నిర్ణయం

కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమ సినిమా పరిశ్రమ.

Cinemas: సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. జగన్ సర్కారు కీలక నిర్ణయం

Theatres

Cinemas: కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమ సినిమా పరిశ్రమ. అందులోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితులు నెలకొనగా.. లాక్‌డౌన్‌ సమయం నుంచి నీలి మేఘాలు కమ్ముకున్న పరిశ్రమకు గుడ్ న్యూస్ అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కరోనా తగ్గుముఖం పట్టడంతో 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.

ఆగస్ట్‌లో ఓపెన్ అయిన థియేటర్స్‌లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే ఇప్పటివరకు నడిపిస్తున్నారు. అయితే, కరోనా నుంచి రాష్ట్రం కోలుకోవడంతో పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లేక్సులు 2021 అక్టోబర్ 14వ తేదీ అంటే, రేపటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల రన్ కానున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మహా సముద్రం, పెళ్లిసందD వంటి పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో థియేటర్లకు జనాలు వస్తారని భావిస్తుంది ప్రభుత్వం.