AP Films : ఒక్క జిల్లాలో 15 థియేటర్లు సీజ్…సమావేశం కానున్న ఎగ్జిబిటర్లు

తమకు గిట్టుబాటు కాదంటూ థియేటర్లు మూసివేస్తున్నాయి యాజమాన్యాలు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు గురువారం విజయవాడలో సమావేశం కానున్నారు.

AP Films : ఒక్క జిల్లాలో 15 థియేటర్లు సీజ్…సమావేశం కానున్న ఎగ్జిబిటర్లు

Ap Films

Raids On Cinema Halls : ఏపీలోని పలు జిల్లాలో ఉన్న థియేటర్లపై అధికారులు ఫోకస్ చేశారు. నిబంధనలు అతిక్రమించిన థియేటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో పలు థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. 15 థియేటర్లు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని అన్ని థియేటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫైర్‌ సేఫ్టీ, టికెట్‌ రేట్లు, కోవిడ్‌ ప్రోటోకాల్‌పై సోదాలు చేశారు. కొన్ని చోట్ల టికెట్‌ రేట్ల కంటే తినుబండారాల రేట్లే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని థియేటర్లు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విసన్నపేటలో రెండు థియేట్లర్లను మూసివేశారు. ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మడంతో అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తక్కువ రేట్లతో టికెట్లు ఇస్తే.. తమకు గిట్టుబాటు కాదంటూ థియేటర్లు మూసివేస్తున్నాయి యాజమాన్యాలు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు 2021, డిసెంబర్ 23వ తేదీ గురువారం విజయవాడలో సమావేశం కానున్నారు.

Read More : President Candidate 1 vote : ప్రెసిడెంట్ అభ్యర్థికి ఒకే‘ఒక్క’ ఓటు..సొంత ఇంట్లోనే 12మంది ఓటర్లున్నా..ఎవ్వరు వెయ్యలేదు..

ఏపీలో సినిమా థియేటర్లపై అధికారులు ఫోకస్‌ చేశారు. థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. థియేటర్ల లైసెన్స్‌లు, సినిమా టికెట్లు ఎంత ధరకు అమ్ముతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని షోలు వేస్తున్నారు.. టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇస్తున్నారా.. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్నారా అన్న విషయాలపై ఆరా తీశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లపై కొరడా జులిపించారు.

Read More : Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే

విజయనగరం జిల్లాలోని సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు జాయింట్ కలెక్టర్ కిషోర్. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు సినిమా థియేటర్లను సీజ్‌ చేశారు. 2015 నుంచి సేఫ్టీ లైసెన్స్ రెన్యువల్ చేయని పూసపాటిరేగలోని సాయికృష్ణ థియేటర్‌కు తాళాలు వేశారు. అలాగే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న భోగాపురంలోని గోపాలకృష్ణ థియేటర్, నెల్లిమర్లలోని ఎస్‌త్రీ థియేటర్లను మూసివేశారు. ఇటు విజయవాడ, ఒంగోలులోని పలు థియేటర్లను పరిశీలించారు అధికారులు. టికెట్లు, అల్పాహారాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవోను పక్కాగా అమలు పరచాల్సిందేనని యజమానులకు స్పష్టం చేశారు.