సూర్య సినిమాకు ప్రశంసల వెల్లువ.. గోపినాథ్ ఏమన్నారంటే!

వెర్సటైల్ యాక్టర్ సూర్య, అపర్ణ బాలమురళి జంటగా.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది

సూర్య సినిమాకు ప్రశంసల వెల్లువ.. గోపినాథ్ ఏమన్నారంటే!

Aakasam Nee Haddura: వెర్సటైల్ యాక్టర్ సూర్య, అపర్ణ బాలమురళి జంటగా.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ‘సింప్లి ఫ్లై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్‌లో Soorarai Pottru.. కాగా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ చేశారు. ‘గురు’ ఫేం సుధ కొంగర దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయాలని తమిళనాడు సినీ పరిశ్రమలో కొందరు వివాదం చేసినా, వాళ్లందరినీ ఎదిరించి, ఓ‌టీటీలోనే రిలీజ్ చేశారు సూర్య.

‘ఆకాశం నీ హద్దురా’ కు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. కేవలం 24 గంటల్లో 55 మిలియన్ల మందికి పైగా చూశారని ట్రేడ్ వర్గాలవారు చెబుతున్నారంటే రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తన జీవితంలోని అత్యంత కీలకమైన సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని చూసి జి.ఆర్.గోపినాథ్ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియచేశారు.

సూర్య, సుధా కొంగరలకు హ్యాట్సాఫ్‌ : జి.ఆర్.గోపినాథ్
‘‘గత రాత్రి ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా చూశాను. సినిమా రోలర్‌ కోస్టర్‌లా అనిపించింది. ఫిక్షన్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుసక్తంలోని ఎమోషన్స్‌ను చాలా బాగా క్యాప్చర్‌ చేశారు. నాకు నవ్వు రాలేదు.. ఏడుపు రాలేదు. కానీ నాకు నా గతం గుర్తొచ్చింది.

అసమానతలతో వెనుకబడిన గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక పారిశ్రామికవేత్త యొక్క పోరాటాలు, కష్టాలకు వ్యతిరేకంగా సాధించిన నిజమైన విజయం. నా భార్య భార్గవి పాత్రను అపర్ణ చక్కగా చేసింది. తన స్వబుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వంతో పాటు మృదుస్వభావి. గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం కల వ్యక్తిగా చక్కగా చూపించారు.

GR Gopinath

తన కలను నిజం చేసుకునే ఓ పిచ్చి, ప్యాషన్‌తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడనే చూపించే నా పాత్రను సూర్య అద్భుతంగా చేశారు. ఇక డైరెక్టర్‌ సుధా కొంగరకు హ్యాట్సాఫ్‌. ఆమె సూర్య, అపర్ణ పాత్రలను చాలా చక్కగా బ్యాలెన్స్‌ చేసింది’’ అన్నారు.

గర్వంగా ఫీలవుతున్నాను : మాధవన్
ఇక విలక్షణ నటుడు ఆర్.మాధవన్ కూడా సినిమా చూసి తన స్పందన తెలియచేశారు. సినిమాను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఆకాశం నీ హద్దురా’ సినిమా చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఎయిర్ డెక్కన్‌లో ప్రయాణించిన తొలి కొద్ది మంది ప్రయాణికుల్లో నేనూ ఒకడిని. హ్యాట్సాఫ్ కెప్టెన్ గోపీనాథ్’’ అని మాధవన్ ట్వీట్ చేశారు.