గెట్ రెడీ ఫర్ డిస్కో సెలబ్రేషన్స్

  • Published By: sekhar ,Published On : January 14, 2020 / 06:10 AM IST
గెట్ రెడీ ఫర్ డిస్కో సెలబ్రేషన్స్

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. జాతీయ అవార్డ్ గెలుచుకున్న ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. జనవరి 13న ఈ సినిమా సెకండ్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

టీజర్‌లో బుర్మా సేతుగా బాబీ సింహా నటన, రవితేజ గెటప్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. తాజాగా గెట్ రెడీ ఫర్ డిస్కో సెలబ్రేషన్స్ ‘డిస్కోరాజా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ప్రకటించింది మూవీ టీమ్. ముందుగా జనవరి 18న ఫంక్షన్ ప్లాన్ చేయలనుకున్నారు. అయితే ఒకరోజు తర్వాత జనవరి 19న డిస్కోరాజా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏర్పాట చేయనున్నారు.

హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జనవరి 19 సాయంత్రం 6 గంటలనుండి డిస్కోరాజా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రారంభంకానుంది. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందుగానే జనవరి 24న ‘డిస్కోరాజా’ సినిమాను విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.

Image