రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లూసిఫర్.. వేదాళం కంటే ముందే!

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో లూసిఫర్.. వేదాళం కంటే ముందే!

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీలు అంటే మాస్ జనాలను విపరీతంగా ఆకర్షించేవి.. సమరసింహా రెడ్డి, ఇంద్ర వంటి సినిమాలు రికార్డ్ హిట్‌లుగా నిలిచాయి. ఇటీవలికాలంలో మాత్రం రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్ ఉండే సినిమాలు అరుదు అయిపోయాయి. అందులోనూ పెద్ద హీరోలైతే వాటిజోలికే పోవట్లేదు.. అటువంటి సమయంలో ఇప్పుడు రాయలసీమ కథ, కథనంకి అవకాశం ఉన్న లూసిఫర్ రీమేక్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ప్ర‌స్తుతం త‌న 152వ సినిమా ఆచార్య‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్న చిరంజీవి.. ఈ సినిమా త‌ర్వాత రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఒక‌టి మ‌ల‌యాళ రీమేక్ లూసిఫ‌ర్‌.. రెండవది తమిళ సినిమా వేదాళం రీమేక్‌. ఈ రెండింటిలో ముందుగా లూసిఫర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారట చిరంజీవి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని దర్శకునికి, నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరిగిపోగా.. సినిమాలో ప్రధాన పాత్రకు కుడిభుజంగా ఉండే ఓ పాత్ర, చిరు సోద‌రి పాత్ర, చిరు సోద‌రి భ‌ర్త‌.. సినిమాకు మెయిన్ విల‌న్ పాత్రలను వెతుకుతున్నారు.  అందులో ఒక క్యారెక్టర్‌కు ఇప్పటికే జగపతిబాబును సంప్రదించినట్లు సమాచారం. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రను చిరంజీవి పోషిస్తుండగా.. మిగిలిన పాత్రలు కూడా ఈ సినిమాలో హైలెట్‌గా ఉంటాయి. అందుకే ఆ పాత్రలకు కూడా ఫేమస్ క్యారెక్టర్లను పెట్టే ఆలోచనలో ఉన్నారు.

జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుండగా.. తెలుగువారికి పరిచయమైన ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. హనుమాన్ జంక్షన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి తమళనాటకు వెళ్లిపోయిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యత అందుకున్నాడు.

ఇందులో ముఖ్యమైన పాత్రల్లో ఒకటి చెల్లెలు పాత్ర కాగా.. ఆ పాత్రకు పలువురు స్టార్ హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు కాదు.. 90స్‌లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లను.. ఈ వరసలో ఇప్పటికే విజయశాంతి, రమ్యకృష్ణ పేర్లు వినిపిస్తూ ఉండగా.. ఇప్పుడు మ‌ల‌యాళ లూసిఫ‌ర్‌లో ఆ పాత్ర చేసిన ముంజు వారియ‌ర్‌నే తీసుకుంటార‌ని అన్నారు. అయితే చివరకు ప్రియ‌మ‌ణి, సాయి పల్లవి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. దీనిపై మాత్రం ఇప్పటివరకు చిత్రయూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ సినిమాని రామ్‌చరణ్‌తో పాటు ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాతే వేదాళం సినిమా రీమేక్ సెట్స్‌పైకి ఎక్కనుంది.