రూ.55లక్షలు చెల్లించాలి : నటి అనసూయకు నోటీసులు

సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌కు నోటీసులు ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 03:10 AM IST
రూ.55లక్షలు చెల్లించాలి : నటి అనసూయకు నోటీసులు

సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌కు నోటీసులు ఇచ్చారు.

సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌కు నోటీసులు ఇచ్చారు. అనసూయ రూ.55 లక్షలు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని జీఎస్టీ అధికారులు తెలిపారు. అనసూయ రూ.80 లక్షలు సేవాపన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.25లక్షలు మాత్రమే చెల్లించారని జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ బాలాజీ మంజుందార్‌ తెలిపారు. అనసూయ గతంలో రూ.35 లక్షల సర్వీస్‌ ట్యాక్స్‌ బకాయి ఉన్నారని వెల్లడించారు. సకాలంలో చెల్లించని కారణంగా రూ.15 లక్షలు వడ్డీ పడింది.

కాగా, తమపై GST దాడులు జరిగినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం అని.. కొన్ని రోజుల క్రితమే నటి అనసూయ, యాంకర్ సుమ అన్నారు. జీఎస్టీ దాడులు రూమర్స్ అని చెప్పారు. ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా సుమ ఓ వీడియోను రిలీజ్ చేయగా.. అనసూయ కామెంట్స్ ని పోస్టు చేశారు. జీఎస్టీ దాడుల్లో ఎలాంటి నిజం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాంప్ట్ గా జీఎస్టీ చెల్లిస్తున్నానని, రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని సుమ, అనసూయ వెల్లడించారు.

తన ఇంట్లో కానీ సంస్థల్లో కానీ ఎలాంటి సోదాలు జరగలేదని అనసూయ చెప్పారు. ఊహాజనితమైన కథలు, వ్యక్తిగత అభిప్రాయాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. మంచి పేరు, గౌరవం తెచ్చుకోవడానికి తాము చాలా కష్టపడ్డామన్నారు. మీడియా చాలా శక్తిమంతమైందని, సమాజానికి మంచి చేయడంపై దృష్టి సారించాలన్నారు. అనవసరంగా ఇబ్బందులకు గురి చేయవద్దని వెల్లడించిన అనసూయ…ఏదైనా వార్తను ప్రసారం చేసే ముందు..అందులోని వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.

అనసూయ ఇలా చెప్పిన కొన్ని రోజుల్లోనే.. జీఎస్టీ అధికారులు అనసూయకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని చెబుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరిప్పుడు అనసూయ ఏం సమాధానం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

* యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారుల నోటీసులు
* రూ.55 లక్షలు జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు
* సర్వీస్ ట్యాక్స్ కింద రూ.80లక్షల బకాయి ఉన్న అనసూయ
* రూ.25లక్షలు మాత్రమే చెల్లింపు