రణ్‌వీర్ సింగ్ గల్లీబాయ్ ట్రైలర్

రీసెంట్‌గా సింబాతో సూపర్ హిట్ కొట్టిన రణ్‌వీర్ గల్లీబాయ్‌పై మంచి అంచనాలున్నాయి.

  • Published By: sekhar ,Published On : January 9, 2019 / 10:30 AM IST
రణ్‌వీర్ సింగ్ గల్లీబాయ్ ట్రైలర్

రీసెంట్‌గా సింబాతో సూపర్ హిట్ కొట్టిన రణ్‌వీర్ గల్లీబాయ్‌పై మంచి అంచనాలున్నాయి.

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా, జోయా అక్తర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ, గల్లీబాయ్.. అప్నా టైమ్ ఆయేగా అనేది ట్యాగ్‌లైన్. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాణీ, జోయా అక్తర్ నిర్మాతలు.  రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ముంబైలోని మురికివాడలో నివసించే ఒక కుర్రాడికి పెద్ద ర్యాపర్ కావాలనీ, సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించాలనీ ఉంటుంది. పేదరికం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మధ్యలో లవ్.. వీటన్నిటినీ ఫేస్ చేస్తూ, తన యాంబిషన్‌ని ఎలా నెరవేర్చుకున్నాడు అనేది గల్లీబాయ్ ట్రైలర్‌లో చూపించారు.

ట్రైలర్‌లో రణ్‌వీర్, అలియా కెమిస్ట్రీ, అంకుర్ తివారీ మ్యూజిక్, జే ఒజా కెమెరా వర్క్ బాగున్నాయి. రీసెంట్‌గా సింబాతో సూపర్ హిట్ కొట్టిన రణ్‌వీర్ గల్లీబాయ్‌పై మంచి అంచనాలున్నాయి. కల్కీ కొచ్చిన్, విజయ్ రాజ్ తదితరులు నటిస్తున్న గల్లీబాయ్, ప్రేమికుల దినోత్సవం కానుకగా, ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.

వాచ్ గల్లీబాయ్ ట్రైలర్…