Hansika : హీరో శింబుతో బ్రేకప్ గురించి మాట్లాడిన హన్సిక..

యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే హన్సిక గతంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ తరువాత బ్రేకప్ తో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ విషయం గురించి మాట్లాడని హన్సిక..

Hansika : హీరో శింబుతో బ్రేకప్ గురించి మాట్లాడిన హన్సిక..

hansika simbu love

Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు సోహైల్ కతూరియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ. అయితే సోహైల్ కంటే ముందు హన్సిక కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ తరువాత బ్రేకప్ తో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ విషయం గురించి మాట్లాడని హన్సిక.. ఇప్పుడు పెళ్లి తరువాత శింబుతో బ్రేకప్ గురించి పెదవి విప్పింది.

Hansika : నా భర్తకు అంతకుముందే పెళ్లి అయింది.. నా భర్త విడాకులకు నేను కారణం కాదు.. హన్సిక వ్యాఖ్యలు..

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ప్రేమను నమ్ముతాను, అలాని నేను రొమాంటిక్ పర్సన్ కాదు. ఎందుకంటే నేను అన్ని ఎమోషన్స్ ని ఈజీగా వ్యక్తపరచలేను. నాతో జీవితాంతం కలిసి అడుగు వేసే వ్యక్తిని ఎంచుకోడానికి నాకు చాలా కాలమే పట్టింది. ఎందుకంటే నా గత రేలషన్ షిప్ (శింబుతో ప్రేమ) విచిత్రంగా ముగిసింది. ఆ బ్రేకప్ తరువాత మరో వ్యక్తికి ఓకే చెప్పడానికి నాకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది. అయినా అది ముగిసిన కథ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తమిళనాట వైరల్ అవుతున్నాయి.

కాగా హన్సిక తన పెళ్లి వీడియో రైట్స్ ని డిస్నీప్లస్ హాట్ స్టార్ ఇచ్చింది. ఫిబ్రవరి 10న ఈ పెళ్లి డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఈ పెళ్లి వీడియో రిలీజ్ ని కూడా సినిమా విడుదల రేంజ్ లో చేశారు. ప్రోమోలు, టీజర్ లు రిలీజ్ చేసి హన్సిక సందడి చేసింది. ఇక ఈ పెళ్లి వీడియోలో హన్సిక సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు చూపించారు. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి చేసుకున్న సోహైల్.. తన ఫ్రెండ్ మాజీ భర్త అని తెలిజేయడమే కాకుండా, వారిద్దరూ విడాకులకు హన్సిక కారణం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కూడా వివరించింది.