హ్యాకర్ల పనేనా : హన్సిక పర్సనల్ ఫొటోలు లీక్!

బబ్లీ బ్యూటీ హన్సిక పర్సనల్ ఫొటోలు లీకయ్యాయి. హాలీడే ట్రిప్ లో దిగిన ఈ బ్యూటీ బికినీ ఫొటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల హన్సిక న్యూయార్క్ కు హాలీడే ట్రిప్ వెళ్లింది.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 02:21 PM IST
హ్యాకర్ల పనేనా : హన్సిక పర్సనల్ ఫొటోలు లీక్!

బబ్లీ బ్యూటీ హన్సిక పర్సనల్ ఫొటోలు లీకయ్యాయి. హాలీడే ట్రిప్ లో దిగిన ఈ బ్యూటీ బికినీ ఫొటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల హన్సిక న్యూయార్క్ కు హాలీడే ట్రిప్ వెళ్లింది.

బబ్లీ బ్యూటీ హన్సిక పర్సనల్ ఫొటోలు లీకయ్యాయి. హాలీడే ట్రిప్ లో దిగిన ఈ బ్యూటీ బికినీ ఫొటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల హన్సిక న్యూయార్క్ కు హాలీడే ట్రిప్ వెళ్లింది. అక్కడ దిగిన తన పర్సనల్ ఫొటోలు కొన్ని ఇన్ స్టాగ్రామ్ లో లీక్ అయి వైరల్ గా మారాయి. లీకైన ఫొటోల్లో హన్సిక స్పోర్టింగ్ బికినీతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోలు సడన్ గా సోషల్ మీడియాలో కనిపించే సరికి.. అభిమానులు షాక్ అయ్యారు. వెంటనే ఈ ఫొటోలను హన్సిక, ఇన్ స్టాగ్రామ్ కు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. వెంటనే స్పందించిన ఇన్ స్టాగ్రామ్.. హన్సిక ఫొటోలను అకౌంట్ నుంచి తొలగించింది. 

ఈ ఫొటోలు ఎలా ఎక్కడి నుంచి లీక్ అయ్యాయో తెలియదు గానీ, హన్సిక ప్రమేయం లేకుండానే లీకయినట్టు తెలుస్తోంది. హ్యాకర్ల పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీకైన తన ఫొటోలపై హన్సిక ఇంకా స్పందించలేదు. యాక్షన్ థ్రిల్లర్ మూవీ తుపాకీ మునాయ్ చిత్రంలో హన్సిక నటించగా.. బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం హన్సిక తన 50వ మూవీ ‘మహా’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీకి యూర్ జమీల్ దర్శకత్వం వహిస్తుండగా.. హన్సిక బోల్డ్ న్యూ అవతర్ గా కనపించనుంది. 

హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు లీకవ్వడం ఇది తొలిసారి కాదు. గతంలో  నటి అక్షర హాసన్ పర్సనల్ ఫొటోలు కూడా  లీక్ అయ్యాయి. మొబైల్లో ఫొటోలను ఎవరో హ్యాక్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీనిపై అక్షర సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.