My Name Is Shruthi: మూడు భాషల్లో హన్సిక సినిమా!
అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా హిందీ డబ్బింగ్ సినిమాతో దక్షణాది ప్రేక్షకులకు కూడా పరిచయమున్నా.. అల్లు అర్జున్ దేశముదురుతో యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక..

My Name Is Shruthi: అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా హిందీ డబ్బింగ్ సినిమాతో దక్షణాది ప్రేక్షకులకు కూడా పరిచయమున్నా.. అల్లు అర్జున్ దేశముదురుతో యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక తొలి సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ మనసు గిల్లేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలతో నటించినా పెద్దగా కలిసిరాలేదు. బొద్దుగా ఉండే హన్సిక కాస్త సన్నబడి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Hansika Motwani: యాపిల్ బ్యూటీ ప్రయోగం.. 105 నిమిషాలు.. సింగిల్ షాట్!
అయితే, ఈసారి రొటీన్ సినిమాలతో కాకుండా కాస్త భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటుంది. ప్రయోగాలకు కూడా సిద్ధమైంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఒకే చెప్తుంది. ఈ మధ్యనే ఎలాంటి ఎడిటింగ్ లేకుండా 105 నిమిషాల పాటు సింగిల్‌షాట్‌లో తెరకెక్కే సినిమాలో హన్సిక సోలో పర్ఫామెన్స్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారట.
Hansika Motwani: లేడీ ఓరియెంటెడ్ బాటలో హన్సిక.. ‘మై నేమ్ ఈజ్ శృతి’!
అవయవాల మాఫియా నేపథ్యంలో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. బురుగు రమ్యాప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మా సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుందని.. ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ ధీమాగా చెప్తుండగా.. టీజర్ తో ఇప్పటికే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.