Hansika : నా భర్తకు అంతకుముందే పెళ్లి అయింది.. నా భర్త విడాకులకు నేను కారణం కాదు.. హన్సిక వ్యాఖ్యలు..

హన్సిక భర్త సోహైల్ కు గతంలోనే హన్సిక ఫ్రెండ్ తో వివాహం అయింది. ఆమెతో విడాకులు అయ్యాక హన్సికని పెళ్లి చేసుకున్నాడు. అయితే హన్సిక భర్త మొదటి పెళ్ళిలో హన్సిక ఎంజాయ్ చేసిన వీడియోలు, ఫోటోలు వీరి పెళ్ళికి ముందు వైరల్ అయ్యాయి. వాళ్లిద్దరూ విడిపోవడానికి హన్సికనే కారణం అంటూ కొంతమంది విమర్శించారు............

Hansika : నా భర్తకు అంతకుముందే పెళ్లి అయింది.. నా భర్త విడాకులకు నేను కారణం కాదు.. హన్సిక వ్యాఖ్యలు..

Hansika reacts on her husband first marriage and divorce in her wedding video

Hansika :  యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే సోహైల్ కతూరియాని వివాహం చేసుకుంది. వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఆ సమయంలో వైరల్ అయ్యాయి. అయితే వీరి పెళ్లి వీడియో మాత్రం ఇప్పుడు ఓ ఓటీటీలోకి వచ్చింది. ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు తమ పెళ్లి వీడియోల్ని ఓ డాక్యుమెంట్ లా చిత్రీకరించి ఓటీటీ వేదికలకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ పద్దతిలోనే హన్సిక, సోహైల్ పెళ్లి వీడియో డిస్నీప్లస్ హాట్ స్టార్ తీసుకుంది. ఫిబ్రవరి 10 నుంచి వీరి పెళ్లి వీడియో ఆ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

స్ట్రీమింగ్ కి ముందు నుంచే ప్రోమో, ట్రైలర్ అంటూ ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. ఇక ఈ వీడియోలో తమ పెళ్లి వేడుకలతో పాటు అనేక విషయాలని పంచుకుంది హన్సిక. హన్సిక భర్త సోహైల్ కు గతంలోనే హన్సిక ఫ్రెండ్ తో వివాహం అయింది. ఆమెతో విడాకులు అయ్యాక హన్సికని పెళ్లి చేసుకున్నాడు. అయితే హన్సిక భర్త మొదటి పెళ్ళిలో హన్సిక ఎంజాయ్ చేసిన వీడియోలు, ఫోటోలు వీరి పెళ్ళికి ముందు వైరల్ అయ్యాయి. వాళ్లిద్దరూ విడిపోవడానికి హన్సికనే కారణం అంటూ కొంతమంది విమర్శించారు.

Akashay Kumar-Kamal Haasan : అన్ని పరిశ్రమల స్టార్ హీరోలు ఒకరి పెళ్ళిలో.. ఎవరి పెళ్లి తెలుసా??

తాజాగా రిలీజయిన హన్సిక మ్యారేజ్ వీడియోలో ఈ విషయంపై స్పందించింది. ఈ వీడియోలో హన్సిక మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి అన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నా పెళ్లి వార్తలు బయటకి వచ్చాయి. సోహైల్ గురించి బయటకి తెలిసినప్పుడు నాకేం చేయాలో తెలియలేదు. మా అమ్మకి చెప్తే ఫోటోలు పోస్ట్ చేసి అధికారికంగా అందరికి చెప్పమనడంతో సోహైల్ నాకు ప్రపోజ్ చేసిన ఫోటోలు పోస్ట్ చేశాను. ఆ తర్వాత అతనికి గతంలో పెళ్లి అయిందని, వారి పెళ్ళికి నేను వెళ్లానని, నా వల్లే వాళ్ళు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి, కొంతమంది నన్ను విమర్శించారు కూడా. నా భర్తకి గతంలో పెళ్లి జరగడం నిజం. కానీ వారికి అధికారికంగా విడాకులు అయ్యాయి. వాళ్ళ విడాకులకు నేను కారణం కాదు అని తెలిపింది. దీంతో హన్సికని విమర్శించేవాళ్ళకి డైరెక్ట్ గా తన పెళ్లి వీడియోతోనే సమాధానమిచ్చింది.