Hansika Motwani: తను మనువాడే వరుడు ఎవరో చెప్పిన హన్సిక..
కొన్ని వారాల క్రితం హీరోయిన్ హన్సిక మోత్వానీ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు బయటకు రాగా, ఆమె అభిమానులు మరియు ప్రేక్షకులు.. ఈ ముద్దుగుమ్మ పెళ్ళాడే వరుడు ఎవరంటూ ఇంటర్నెట్ ని జల్లెడ పట్టారు. కానీ హన్సిక కుటుంబ సభ్యులు మాత్రం వరుడు ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు. తాజాగా హన్సిక తాను మనువాడే వరుడు వివరాలు బయటపెట్టింది.

Hansika Reveals Her Fiancee Sohal Kathuria
Hansika Motwani: కొన్ని వారాల క్రితం హీరోయిన్ హన్సిక మోత్వానీ డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు బయటకు రాగా, ఆమె అభిమానులు మరియు ప్రేక్షకులు.. ఈ ముద్దుగుమ్మ పెళ్ళాడే వరుడు ఎవరంటూ ఇంటర్నెట్ ని జల్లెడ పట్టారు. కానీ హన్సిక కుటుంబ సభ్యులు మాత్రం వరుడు ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు. తాజాగా హన్సిక తాను మనువాడే వరుడు వివరాలు బయటపెట్టింది.
Hansika Motwani: ఈఫిల్ టవర్ ముందు పెళ్లికి ఓకే చెప్పేసిన హన్సిక
నేడు తాను చేసుకోబోయే వరుడని పరిచయం చేస్తూ నిశ్చితార్థం జరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “సోహైల్ కతురియా” అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడున్నట్లు ప్రకటించిన హన్సిక, ప్యారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటున్న పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. కాగా ఈవెంట్ ప్లానింగ్ కంపెనీని నడుపుతున్న సోహైల్ తో హన్సికకు గత నాలుగైదు ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.
2020 నుండి సోహైల్ కంపెనీలో హన్సిక యాక్టివ్ షేర్ హోల్డర్ గా ఉంటూ వస్తుంది. కొన్ని ఈవెంట్ ప్లానింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం కాగా, అది కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌లో డిసెంబర్ 4న ఈ జంట ఒకటి కానున్నారు. డిసెంబర్ 2 నుంచే ప్యాలెస్ లో పెళ్లి సందడి మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన పనులు కొన్ని వారాల క్రిందటి నుంచే మొదలయ్యాయి.