Hanu-Man: హను-మాన్ టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్..!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హను-మాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆయన తెరకెక్కించే సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో ఈ సినిమా కూడా అదే కోవలో ఉండబోతుందా అని అబిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా హను-మాన్ సినిమా టీజర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ టీజర్‌ను నవంబర్ 21న మధ్యాహ్నం 12.33 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Hanu-Man: హను-మాన్ టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్..!

Hanu-Man: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘హను-మాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆయన తెరకెక్కించే సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో ఈ సినిమా కూడా అదే కోవలో ఉండబోతుందా అని అబిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు తెలపడంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Hanu-Man: ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్!

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందడంతో, ఆయనకు సంతాపం తెలుపుతూ హను-మాన్ సినిమా టీజర్‌ను వాయిదా వేశారు. తాజాగా హను-మాన్ సినిమా టీజర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ టీజర్‌ను నవంబర్ 21న మధ్యాహ్నం 12.33 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

Hanu-man Teaser: హనుమాన్ టీజర్ అప్డేట్ వచ్చేది ఆరోజే!

కాగా, ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి హను-మాన్ చిత్ర టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.