Prabhas : సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?? ఎప్పటికో?

ఇటీవలే సీతారామం సినిమాతో మంచి విజయం సాధించారు హను రాఘవపూడి. మెలోడీ లవ్ స్టోరీస్ చాలా బాగా తీస్తారని హనుకి పేరుంది. యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ఛేంజోవర్ ఇవ్వడానికి హను కథ చెప్పాడని, ప్రభాస్ ఓకే అన్నాడని సమాచారం.

Prabhas : సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?? ఎప్పటికో?

Hanu Raghavapudi planning a movie with Prabhas talk goes viral

Hanu Raghavapudi :  ప్రస్తుతం ప్రభాస్(Prabhas) ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్ని వరుస పాన్ ఇండియా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఆదిపురుష్(Adipurush) జూన్ లో రిలీజ్ కానుంది. సలార్(Salaar) షూటింగ్ చివరిదశలో ఉంది. మారుతీ డైరెక్షన్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోపక్క నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు K సినిమా షూటింగ్ జరుగుతుంది. వీటి తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించి ఉన్నారు. బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.

ప్రభాస్ లైనప్ లో ఉన్న ఈ సినిమాలు ఎప్పటికి అవుతాయో ఎవ్వరికి క్లారిటీ లేదు. ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ ఫ్లాప్ తో రాబోయే సినిమాల కోసం ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే ఇన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉంటే ఇప్పుడు మరో సినిమాను ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తుంది. లవ్ స్టోరిలకు స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడితో ప్రభాస్ సినిమాకి రెడీ అవుతున్నారని టాక్. వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ తో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని హనురాఘవపూడి ప్రభాస్ కోసం రాసినట్టు న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే హను, ప్రభాస్ మధ్య మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.

Ram Charan : వీర్ సావర్కర్ జయంతి.. నిఖిల్‌తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన రామ్ చరణ్.. టైటిల్ ఏంటో తెలుసా?

ఇటీవలే సీతారామం సినిమాతో మంచి విజయం సాధించారు హను రాఘవపూడి. మెలోడీ లవ్ స్టోరీస్ చాలా బాగా తీస్తారని హనుకి పేరుంది. యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ఛేంజోవర్ ఇవ్వడానికి హను కథ చెప్పాడని, ప్రభాస్ ఓకే అన్నాడని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి నిజంగానే ఈ సినిమా ప్రభాస్ లైనప్ లో చేరుతుందా చూడాలి.