Hanu Raghavapudi: ‘భారీ’గా ప్లాన్ చేస్తోన్న సీతారామం డైరెక్టర్..?

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ‘సీతా రామం’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని అత్యద్భుతంగా మలిచాడు హను రాఘవపూడి. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

Hanu Raghavapudi: ‘భారీ’గా ప్లాన్ చేస్తోన్న సీతారామం డైరెక్టర్..?

Hanu Raghavapudi Planning Big Budget Movie After Sita Ramam

Hanu Raghavapudi: టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ‘సీతా రామం’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని అత్యద్భుతంగా మలిచాడు హను రాఘవపూడి. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

Hanu Raghavapudi : నన్ను నమ్మకూడదని ఇండస్ట్రీలో ప్రచారం చేశారు.. వాళ్ళు కనిపిస్తే డైరెక్ట్ గానే అడిగేస్తాను..

కాగా, తన నెక్ట్స్ చిత్రాన్ని హను రాఘవపూడి ఎవరితో చేస్తాడా.. ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో రానుందా అనే ఆసక్తి టాలీవుడ్ ఆడియెన్స్‌లో నెలకొంది. అయితే తన నెక్ట్స్ చిత్రాన్ని హను రాఘవపూడి ఓ మీడియం బడ్జెట్ మూవీగా కాకుండా, ఏకంగా భారీ బడ్జెట్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌తో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు హను రాఘవపూడి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రెడీ చేసేందుకు ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట.

Rishabh Pant Health: యాక్సిడెంట్‌ త‌రువాత తొలిసారి.. న‌డ‌క మొద‌లు పెట్టిన పంత్‌.. ఫొటో షేర్ చేసిన క్రికెట‌ర్

ఇప్పటికే కథను రెడీ చేసుకున్న హను, తన సినిమాకు సరిపోయే హీరోహీరోయిన్ల కోసం వెతుకుతున్నాడట. త్వరలోనే వారిని ఓకే చేసుకుని, ఈ సినిమాను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. మరి హను రాఘవపూడి తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమా ఎలాంటి బడ్జెట్‌తో రూపొందుతుందా అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.