Hanuman: అండర్‌వాటర్‌లో హనుమాన్ అడ్వెంచర్.. మామూలుగా ఉండదట!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ శర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హను-మాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను అండర్ వాటర్‌లో చిత్రీకరిస్తోంది చిత్ర యూనిట్.

Hanuman: అండర్‌వాటర్‌లో హనుమాన్ అడ్వెంచర్.. మామూలుగా ఉండదట!

Hanuman Canning Underwater Action Sequences

Hanuman: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ శర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హను-మాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను అండర్ వాటర్‌లో చిత్రీకరిస్తోంది చిత్ర యూనిట్.

Hanuman : రాముడి జన్మస్థలంలో హనుమాన్ టీమ్ సందడి..

అండర్ వాటర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా నటీనటులే కాకుండా యావత్ చిత్ర టెక్నీషియన్లు కూడా అండర్ వాటర్‌లో ఊపిరి బిగపట్టుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి యాక్షన్ సీన్స్ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ట్రెయినింగ్ తీసుకోవాల్సి ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ భావించాడు. అందుకే ఆయన ఈ అండర్ వాటర్ సీక్వెన్స్‌లు తెరకెక్కించేందుకు హైదరాబాద్‌లోని స్పెషల్ ట్రైనర్ దగ్గర పదిహేను రోజులపాటు శిక్షణ తీసుకున్నారట.

HanuMan Official Teaser : హనుమాన్ టీజర్ వచ్చేసింది.. టీజర్‌లో ఎండ్‌లో వచ్చే సీన్ అయితే గూస్‌బంప్స్..

ఇక ఈ సీక్వెన్స్‌ను ప్రస్తుతం చిత్ర యూనిట్ ముంబైలోని ఎక్స్‌పర్ట్స్ పర్యవేక్షణలో అండర్ వాటర్ షూటింగ్‌ను నిర్వహిస్తోంది. అటు హీరో తేజ సజ్జా కూడా ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం బాగా ట్రెయినింగ్ తీసుకున్నాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఔట్‌పుట్ చూస్తే ప్రేక్షకులు థ్రిల్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.