Hanuman: రామ జన్మస్థలి ‘అయోధ్య’కు వెళ్తోన్న హనుమాన్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘హనుమాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా, సూపర్ హీరో మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించేందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

Hanuman: రామ జన్మస్థలి ‘అయోధ్య’కు వెళ్తోన్న హనుమాన్!

Hanuman Movie Team To Visit Ayodhya Ram Mandir

Hanuman Movie: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘హనుమాన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా, సూపర్ హీరో మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Hanuman Vs Adipurush : హనుమాన్ వర్సెస్ ఆదిపురుష్.. హనుమాన్ టీజర్ రాకతో ఓంరౌత్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

హనుమాన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాము ఈ సినిమాను ఎంతో కష్టపడి చేస్తున్నామని, ప్రేక్షకులు తమ కష్టాన్ని గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించేందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. రాముడి అపరభక్తుడైన హనుమాన్ తమ సినిమా నేపథ్యం కావడంతో శ్రీరాముడి దీవెనలు తీసుకునేందుకు ‘హనుమాన్’ చిత్ర యూనిట్ ఈ మేరకు అయోధ్యకు వెళ్తున్నారు.

HanuMan Official Teaser : హనుమాన్ టీజర్ వచ్చేసింది.. టీజర్‌లో ఎండ్‌లో వచ్చే సీన్ అయితే గూస్‌బంప్స్..

హనుమాన్ చిత్ర యూనిట్ నవంబర్ 29న అయోధ్యకు పయనమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హరి గౌర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కె.నిరజంన్ రెడ్డి ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.